Good Health : మోస్ట్ ఇంపార్టెంట్ :  చిరాకు, కోపం, ఇరిటేషన్ ఎందుకు వస్తాయి.... తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే..! 

Good Health : మోస్ట్ ఇంపార్టెంట్ :  చిరాకు, కోపం, ఇరిటేషన్ ఎందుకు వస్తాయి.... తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే..! 

ఇంట్లో టీవీ సౌండ్​ పెడితే చాలు చాలామంది చిరాకు పడతారు..  ఒక్క టీ వీ సౌండే కాదు.. కుటుంబ సభ్యులు ఎవరైనా పెద్దగా మాట్లాడినా కోపం వస్తుంది. అన్ని సందర్భాల్లో ఉండదు కానీ కొన్నిసార్లు ప్రతీ ఒక్కరూ ఇది ఫేస్ చేస్తూ ఉంటారు. ఒక్క కోపమే కాదు..చిరాకు.. ఇరిటేషన్ తో వారు మాత్రమే ఇబ్బంది పడకుండా.. ఇతరులకు కూడా చిరాకు తెప్పిస్తుంటారు.  మరి అలాంటి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..!

ప్రస్తుతం జనాలు చిన్న విషయానికే చిర్రు బుర్రులాడుతుంటారు.  ఇక ఇంట్లో ఎవరైనా గట్టిగా మాట్లాడినా.. పెద్ద సౌండ్​తో టీవీ.. ఫోన్​ సౌండ్​ పెట్టితే చాలు.. రింగ్​ రింగ్​ అంటే చాలు.. ఇంట్లో వారిపై తెగ చిరాకు పడతారు. ఇక వారి కోపం తారాస్థాయిలోకి వెళ్లి ఇరిటేట్​ ఫీలవుతారు.  ఇది వాళ్లకెలా ఉన్నా.. ఇంట్లో వాళ్లకు మాత్రం నచ్చదు.  ఇలాంటి వారు ట్రెడిషినల్ చైనీస్ మెడిసిన్ (TCM)  స్టడీ ప్రకారం  వ్యక్తిగత అవసరాలకు  వివిధ లక్షణాలను డిస్కస్ చేస్తారట. ఇలాంటి వారు ఎక్కువుగా   మిరపకాయ, ఆనియన్, గార్లిక్, పచ్చళ్లు, వేపుళ్లు, ఇతర బాగా వేడిగా, స్పైసీగా ఉండే ఆహార పదార్థాలను తిన్నప్పుడు శరీరం లోపల వేడి ఉత్పత్తి అయి Yinని ఆవిరి చేస్తుంది. అలాగే ప్రాణ వాయువు తల వైపునకు వెళుతుంది. . దీంతో మైండ్ చాలా హైపర్ యాక్టివ్‌ అయి ... కోపం.. చిరాకు.. ఇరిటేషన్​ వంటి వాటిని ప్రేరేపిస్తుంది. 

అలాంటి సమయంలో  కాఫీ, ఎనర్జీ డ్రింక్స్, విపరీతంగా టీ తాగడం వల్ల TCM ప్రకారం Heart Fire ఓవర్ యాక్టివ్‌గా తయారై  అది కాస్తా అడ్రెనల్ గ్రాండ్‌ని స్టిములేట్ చేసి, నాడీ వ్యవస్థ అశాంతిగా తయారవడానికి కారణం అవుతుంది.  స్వీట్స్, వైట్ బ్రెడ్ వల్ల శరీరంలో గ్లూకోజ్ త్వరగా విడుదలై లివర్ - స్పీన్ యాక్సెస్ మీద వత్తిడి పెంచి మూడ్ స్వింగ్స్‌కి కారణం అవుతుంది. ఆల్కహాల్ తీసుకునే వారికి నేరుగా లివర్ హీట్ పెరిగి, మరుసటి రోజు ఉదయం లివర్ ఫైర్ రీబౌండ్ అవుతుంది.

జీర్ణ శక్తి తక్కువగా ఉన్న వారు మటన్ తీసుకుంటే Yang (ఆవిరి) హీట్ అయి, దాని వల్ల శరీరంలోని నీరు వేడిగా ఉండే బాత్రూమ్‌లో ఎలాగైతే అద్దంపై నీరు ఆవిరిగా పేరుకుంటుందో అలా damp heat తయారయి.. ఇది ఇరిటేషన్ సమస్యకు దారితీస్తుందని TCM  స్టడీ ద్వారా తెలుస్తుంది.అలాగే రాత్రి 9 గంటల తర్వాత ఆహారం తీసుకోవడం వల్ల లివర్ డీటాక్స్ అయ్యే ప్రక్రియను అడ్డుకుంటుంది.  దీంతో  shen సెటిల్ కాకపోవడంతో అనేక సమస్యలు వస్తాయి. 

పరిష్కార మార్గాలు..

మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే.. దోసకాయ, పొట్లకాయ, సొరకాయ, బీరకాయ, బ్రౌన్ రైస్, బార్లీ, మిల్లెట్స్, చల్లటి నీళ్లు కాకుండా గోరు వెచ్చని నీళ్లు తీసుకోవడం వల్ల మెల్లగా ఈ సమస్య తగ్గుతుంది.  చాలా మంది లైఫ్ స్టైల్ విషయానికి వస్తే చాలామంది అర్థరాత్రి వరకూ ఫోన్లు వాడుతున్నారు. నైట్ 10 తర్వాత ఫోన్ వాడితే, TCM ప్రకారం లివర్ బ్లడ్, Yin బర్న్ అవుతాయి. దీంతో Heart Fire రిలాక్స్ అవలేదు. 

►ALSO READ | Childrens story: మునగ చెట్టు పంచాయతీ.. ఇరుగు పొరుగు వారు స్నేహితుల్లా ఉండాలి..

ఎలాంటి ఎక్సర్‌సైజ్ లేకుండా గంటల తరబడి కూర్చున్నా కూడా Qi స్టాగ్నేషన్ ఏ్పడి, ఎమోషన్స్ బ్లాక్ అవుతాయి, దీంతో ఇరిటబులిటీ పెరుగుతుంది.  కొంతమంది బరువు తగ్గాలని భోజనం మానేస్తూ ఉంటారు. మరికొంత మంది ఇష్టమొచ్చిన టైమ్స్ లో ఆహారం తీసుకుంటూ ఉంటారు. ఇలా టైమింగ్స్ లేకపోవడం వల్ల Spleen మెరీడియన్ బలహీనపడి, ఆహారం సరిగా శక్తిగా మార్పిడి జరగక, శరీరంలో అరగని ఆహారం వల్ల dampness పెరిగి ఇరిటబులిటీ పెరుగుతుంది, సరిగా ఆహారం తీసుకోకపోవడం వల్లకూడా గ్లూకోజ్ స్థాయిలు పడిపోయి చిరాకు పెరుగుతుంది.

ప్రాణాయామం వంటి శ్వాస క్రియలు ఏమీ చెయ్యకపోవడం వల్ల, కనీసం ధ్యానం వంటి వాటితో నిశ్శబ్ధంగా కూర్చోవడం చేయకపోవడం వల్ల నిరంతరం.. ఏదో ఒకటి చూస్తూ వింటూ నెర్వస్ సిస్టమ్ ని ఓవర్ స్టిములేట్ చెయ్యడం వల్ల Shen విపరీతంగా బయటకు వెదజల్లబడి, మొహం పాలిపోతుంది, ప్రాణశక్తి లోపిస్తుంది, గ్రౌండింగ్ మిస్ అవుతుంది. దీంతో ఇరిటబులిటీవస్తుంది. 

ఇన్ స్టా రీల్స్ వంటివి ఎక్కువగా చూడడం వల్ల వెంట వెంటనే డోపమిన్ విడుదల అవుతూ అది TCM ప్రకారం Liver Wind, Heart Fire అనే సమస్యలు పెంచుతుంది. అలాగే కొంతమంది తరచూ పొలిటికల్ డిబేట్స్ లో కామెంట్ల మీద కామెంట్లు పెట్టుకుంటూ సంఘర్షణలో ఉంటుంటారు. ఇది Liver Qiని స్టిములేట్ చేసి, మెంటల్ హీట్‌ని పెంచుతుంది. 

కొంతమంది అదే పనిగా ఆధ్యాత్మిక విషయాలు, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, వీడియోలు చూస్తుంటారు. ఒకళ్లు చెప్పేది ఒకలా, మరొకళ్లు చెప్పేలా ఒకలా ఉండేసరికి, ఈ కాన్సెప్టులలో ఏది నిజం అనే ఆలోచనలు నిరంతరం మైండ్‌లో ఓవర్ స్టిమునేషన్ సృష్టిస్తాయి. దీనివల్ల తలలో సూడో Yang పరిస్థితి ఏర్పడి, చివరకు చిరాకు ఫ్రస్టేషన్ వస్తాయి. అందుకే సాయంత్రం 6 తర్వాత అనవసరమైన డిస్కషన్స్, ఓవర్ థింకింగ్, రీల్స్ వంటివి చూడడం, స్క్రీన్ టైమ్ తగ్గించాలి. అలాగే పైన చెప్పినట్లు ఆహార పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.