విజయ్ సీఎం అయితే నాకెందుకు కుళ్లు..? కమల్ సీఎం అయితే అసూయ పడేవాడిని : రజినీకాంత్

విజయ్ సీఎం అయితే నాకెందుకు కుళ్లు..? కమల్ సీఎం అయితే అసూయ పడేవాడిని : రజినీకాంత్

తమిళనాడులో ఎన్నికలు ముగిసి.. ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కూడా.. కొన్ని వివాదాలు.. కొన్ని అపార్థాలకు సంబంధించిన చర్చలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రెండు ద్రవిడ భావజాలలు కలిగిన ఆర్క్ రైవల్స్ ను కాదని.. టీవీకే విజయ్ చరిత్రాత్మక విజయం సాధించడం చాలా మంది జీర్ణించుకోలేని విషయం అయితే.. విజయ్ రాజకీయ చాతుర్యం ఏంటా అని అర్థంకాని వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. 

అయితే ప్రభుత్వ విజయ్ పార్టీ గెలుపు.. ప్రభుత్వ మార్పు అంశంలో విజయ్ పై సూపర్ స్టార్ రజనీ కాంత్ కుళ్లుకుంటున్నారని.. ఆయన అన్నాడీఎంకేతో సీఎం పదవి చేపట్టాలని అనుకున్నారనే ఊహాగాలు వచ్చాయి. ఆ గుసగుసలు చివరికి రజినీపై విమర్శల వరకు తీసుకెళ్లాయి. ఈ ఆరోపణలకు చెక్ పెట్టేందుకు ఎట్టకేలకు రజినీ కాంత్ మీడియా ముందుకు వచ్చారు. వస్తున్న పుకార్లను, విమర్శలను కొట్టిపడేశారు. 

డీఎంకే పార్టీ ఓడిన తర్వాత ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ను రజనీ కలవటంపై వచ్చిన విమర్శలకు ఆయన సమాధానం చెప్పారు. ఒక స్నేహితుడిగా మాత్రమే కలిశానని.. ఓదార్చానని అన్నారు. కానీ విజయ్ సీఎం అవుతున్నారనే విషయాన్ని జీర్ణించుకోలేకే కలిసినట్లు తప్పుడు సంకేతాలను ప్రచారం చేశారని అన్నారు. 

చెన్నై పోయెస్ గార్డెన్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన రజినీ.. విజయ్ ముఖ్యమంత్రి కావడంపై తనకు ఎలాంటి ఈర్శ్య, ద్వేషం లేదన్నారు. తాను రాజకీయాల్లోనే లేనప్పుడు తనకు ఎందుకు ద్వేషం అని అన్నారు. విజయ్ ని చూసి నేనెందుకు కుళ్లుకుంటా.. ఒక వేళ కమల్ హాసన్ అయి ఉంటే ఈర్శ్యపడేవాడిని అంటూ ఓ నవ్వు నవ్వారు. 

►ALSO READ | ‘పెద్ది’ కథపై బిగ్ ట్విస్ట్: ఆయన బయోపిక్ కాదంటూ బుచ్చిబాబు క్లారిటీ.. చరణ్ పాత్రకు స్ఫూర్తి అతనే!

విజయ్ పార్టీ గెలవటం చూసి ఆశ్చర్యపోయానని.. వెంటనే అభినందనలు చెప్పానని అన్నారు రజినీ. తొలి ఎన్నికలలోనే అధికారం చేపట్టడం గొప్పవిషయమని అన్నారు. రజినీ అంత చీప్ కాదు.. లో స్టాండర్డ్ కాదు.. ఏదిపడితే అది అనవసర విషయాలపై నోరుపారేసుకునే తక్కువ స్థాయి తనది కాదన్నారు. 

స్టాలిన్ తో తన స్నేహం రాజకీయాలకు అతీతంగా ఎదిగిందని అన్నారు రజినీ. కోలాతూర్ లో సీఎం ఓడిపోవడం చూసి బాధ కలిగిందని అన్నారు. ఈ సీటు నుంచి మూడు సార్లు గెలిచిన స్టాలిన్.. టీవీకే పార్టీకి చెందిన బీఎస్ బాబు చేతిలో 9 వేల ఓట్లతో ఓడిపోయిన విషయం తెలిసిందే. 

DMK, AIADMK లాంటి రెండు ద్రవిడ పార్టీలను తట్టుకుని గెలవటం విజయ్ గొప్పవిషయమన్నారు రజినీ. తనకంటే 24 ఏళ్లు చిన్నవాడైనా విజయ్ పైన తనకు గౌరవం ఉందన్నారు. తమ మధ్య మంచి సాన్నిహిత్యం ఉందన్నారు. 

  • వివాదం ఎక్కడ మొదలైంది..?

అయితే ఈ విషయంలో వివాదం రావటానికి కారణం.. రజనీ సైలెన్స్ అని కూడా చెప్పవచ్చు. ఎన్నికల ఫలితాలు వచ్చాక.. తమిళనాడులో అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించింది. ఈ సమయంలో విజయ్ సీఎం అవుతున్నారు.. దీనిపై అడగగా రజినీ నో కామెంట్ అంటూ వెళ్లిపోయారు. రెండు తేలుజు జోడించి.. చిన్న నవ్వుతో ఏం చెప్పకుండా వెళ్లిపోయారు. ఇది వివాదానికి కారణం అయ్యింది. అప్పుడే విజయ్ కు శుభాకాంక్షలు చెప్పి ఉంటే ఇంత రాద్దాంతం ఉండేది కాదని కొందరు అంటున్నారు. దీనికి తోడు స్టాలిన్ తో సమావేశం కావడం చూసి.. విజయ్ సీఎం అవ్వటం రజినీకి ఇష్టం లేదనే చర్చలు మొదలయ్యాయి.