గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి వస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’(PEDDI). జాన్వీ కపూర్ హీరోయిన్. భారీ రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా బుచ్చిబాబు తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలకు ఇంకా 2 వారాలే మిగిలి ఉంది. ఈ క్రమంలోనే మేకర్స్ వరుస ప్రమోషన్స్తో మెగా ఫ్యాన్స్కి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొస్తున్నారు. తాజాగా డైరెక్టర్ బుచ్చి వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ పెద్ది గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. ఇందులో రామ్ చరణ్ గ్రామీణ క్రికెటర్‌తో పాటు కుస్తీ వీరుడిగానూ కనిపించడంతోప్ సినిమా కథపై ప్పలు రూమర్స్ వినిపిస్తూ వచ్చాయి. తాజాగా వాటన్నిటికీ క్లారిటీ ఇస్తూ, కొత్త విషయాలను బుచ్చిబాబు చెప్పుకొచ్చారు.
రామ్మూర్తి బయోపిక్ కాదని క్లారిటీ..
‘పెద్ది’ సినిమా కోడి రామ్మూర్తి నాయుడు బయోపిక్ కాదని దర్శకుడు బుచ్చిబాబు స్పష్టం చేశారు. తూర్పుగోదావరికి చెందిన ‘పెద్దిరాజు’ అనే వ్యక్తి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని, కల్పిత అంశాలు జోడించి ఈ కథను రూపొందించినట్లు తెలిపారు.
“మా ఊర్లో పేద కుటుంబంలో పుట్టిన పెద్దిరాజు అనే వ్యక్తి ఉండేవాడు. తాపీ పని చేస్తూనే క్రికెట్, బాస్కెట్ బాల్ బాగా ఆడేవాడు, ఎవరైనా డబ్బు ఇస్తే వారి తరఫున వెళ్లి ఆడేవాడు. ఏ మ్యాచ్ అయినా ఒంటిచేత్తో గెలిపించే టాలెంట్ ఉండేది. అందుకే అతనికి రూ.150 ఇచ్చి పని మానిపించి క్రికెట్ ఆడించేవాళ్లం.” అని బుచ్చి బాబు చెప్పుకొచ్చాడు.
►ALSO READ | Sreeleela: ముంబై ఇండియన్స్ స్టార్ క్రికెటర్తో ‘పడ్డానండీ ప్రేమలో మరి’.. శ్రీలీల లవ్ జర్నీ స్టార్ట్ అయిందా?
అలాగే సినిమాలో కోడి రామ్మూర్తి ప్రస్తావన మాత్రమే ఉంటుందని, ఆయన శిష్యుడిగా శివరాజ్‌కుమార్, అపి శివన్న శిష్యుడి పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తారని వెల్లడించారు. ఇక లేటెస్ట్గా రిలీజైన గ్లింప్స్లో కూడా కోడి రామ్మూర్తి నాయుడు జిల్లా స్థాయి కుస్తీ పోటీలు అనే బ్యానర్స్ ఉండటంతో మరింత వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చారు.
పెద్ది కథ ఎక్కడ మొదలైందంటే?
‘ఉప్పెన’ విడుదలకు ముందే ‘పెద్ది’ కథ సిద్ధమైందని బుచ్చిబాబు తెలిపారు. పిఠాపురంలోని దత్తాత్రేయ స్వామి ఆలయంలో ఈ కథను డెవలప్ చేసినట్లు వెల్లడించారు. మొదట రాసుకున్న పెద్ది కోర్ పాయింట్ ని సుకుమార్ కి చెప్పడంతో.. కాన్సెప్ట్ అదిరిపోయిందని సుక్కు భాయ్ చెప్పినట్లు తెలిపారు. ఇదే సమయంలో హీరోయిన్‌గా మొదట ఖుషి కపూర్‌ను అనుకున్నప్పటికీ, చివరకు జాన్వీ కపూర్‌ను ఎంపిక చేసినట్లు చెప్పారు.
Here are some fun BTS moments that are close to our heart ❤️
— PEDDI (@PeddiMovieOffl) May 8, 2026
Megastar @KChiruTweets Garu and Maverick director @aryasukku Garu visited the shoot of #Peddi ✨️#PEDDI WORLDWIDE RELEASE IN CINEMAS ON JUNE 4th, with PREMIERES on JUNE 3rd
Trailer announcement soon 💥 pic.twitter.com/2W2aTQyjtd
జూన్ 4న పెద్ది ప్రభంజనం..
పెద్ది చిత్రంలో రామ్ చరణ్ ఒక రెజ్లర్ (పహిల్వాన్), క్రికెటర్ పాత్రల్లో ఊరమాస్ లుక్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన పాటలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అంతకంటే ముందు జూన్ 3న ప్రీమియర్ షోలు పడనున్నాయి. మరీముఖ్యంగా రేపు సోమవారం మే 18న రిలీజ్ కానున్న ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
