ఎక్సర్‌ సైజ్‌‌లో ఈ తప్పులు చేస్తున్నరా?

V6 Velugu Posted on Mar 02, 2021

బరువు తగ్గాలన్నా, ఫిట్‌‌గా ఉండాలన్నా ఎక్సర్‌‌‌‌సైజ్‌‌ చాలా అవసరం. ప్యాండెమిక్‌‌ కారణంగా జిమ్‌‌లు, ఫిట్‌‌నెస్‌‌ సెంటర్లకు వెళ్లే వీలు లేకపోవడం, అవి తెరుచుకున్నా కూడా ఏమవుతుందో అనే భయంతో చాలామంది ఇంట్లోనే ఎక్సర్‌‌‌‌సైజ్‌‌లు మొదలుపెట్టారు. ఇంట్లోనే సొంతంగా చేసేవాళ్లు సరైన ట్రైనింగ్‌‌ లేక కొన్ని తప్పులు చేస్తుంటారు. అలా చేసే చిన్న తప్పుల వల్ల పెద్ద ప్రమాదం వచ్చే అవకాశం ఉందని .. ఇంట్లో ఎక్సర్‌‌‌‌సైజ్‌‌లు చేసేవాళ్లు ఈ బ్లండర్స్ చేయకుండా  జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటున్నారు  ఫిట్‌‌నెస్‌‌ ఎక్స్‌‌పర్ట్స్‌‌.

నొప్పిని లైట్‌‌ తీసుకోవడం

ఇంట్లో వర్కవుట్‌‌ చేసుకునేటప్పుడు మన పోశ్చర్స్‌‌ను చెక్‌‌ చేసేవాళ్లు ఉండరు. కాబట్టి ఎలాపడితే అలా చేయడం వల్ల కండరాళ్లు పట్టి నొప్పులు వస్తాయి. ఆ నొప్పులను చాలామంది లైట్‌‌ తీసుకుంటారు. కానీ, వాటిని లైట్‌‌ తీసుకోకూడదు. ఆ నొప్పి తగ్గేవరకు రెస్ట్‌‌ తీసుకోవాలి. అప్పటికీ నొప్పి తగ్గకపోతే కచ్చితంగా డాక్టర్‌‌‌‌ దగ్గరకు వెళ్లాలి. అలా కాకుండా మొండిగా వర్కవుట్స్‌‌ చేస్తే ముందుముందు చాలా ప్రాబ్లమ్‌‌ అవుతుంది.

కార్బ్స్‌‌ పూర్తిగా మానొద్దు

చాలామంది డైటింగ్‌‌ చేసేటప్పుడు కార్బోహైడ్రేట్స్‌‌ తీసుకోవడం పూర్తిగా మానేస్తారు. కానీ, అది కరెక్ట్‌‌ కాదు. డైటింగ్‌‌ అంటే మనకు అన్ని న్యూట్రియంట్స్‌‌ అందాలి. కాబట్టి అన్నింటినీ సమంగా తీసుకోవాలి. ఈ టైంలో మన శరీరానికి మినరల్స్‌‌, ప్రొటీన్స్‌‌, ఐరన్‌‌, క్యాల్షియం, పొటాషియం అందటం చాలా ముఖ్యం.

ప్లానింగ్‌‌ అవసరం

ఎంత తగ్గాలి? ఎలా తగ్గాలి? అనే విషయంలో కచ్చితంగా గోల్‌‌, ప్లానింగ్‌‌ ఉండాలి. గోల్‌‌ పెట్టుకుని మన లైఫ్‌‌స్టైల్‌‌కు తగ్గట్లుగా ఎలాంటి ఎక్సర్‌‌‌‌సైజ్‌‌లు చేయాలనే విషయాన్ని ప్లాన్‌‌ చేసుకోవాలి. ఆ గోల్స్‌‌ కూడా ఇతరులతో పోల్చుకోకూడదు. రియలిస్టిక్‌‌ గోల్స్ పెట్టుకుంటే కచ్చితంగా ఫిట్‌‌నెస్‌‌పైన ఫోకస్‌‌ పెరుగుతుంది.  వామప్‌‌, కూల్‌‌డౌన్‌‌ను మిస్‌‌ కావద్దు ఎక్సర్‌‌‌‌సైజ్‌‌ చేసేముందు వామప్‌‌, వర్కవుట్‌‌ తర్వాత కూల్‌‌డౌన్‌‌లను మిస్‌‌ చేయకూడదు. వామప్‌‌, కూల్‌‌డౌన్‌‌ను మిస్‌‌ చేస్తే ఇంజ్యూరీ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్సర్‌‌‌‌సైజ్‌‌ చేసే బిగినర్స్‌‌కి అయితే ఒళ్లునొప్పులు ఉండవు.

మోటివేషన్‌‌ కోసం..

ఫిట్‌‌నెస్‌‌ ప్రేరణ కోసం జిమ్‌‌ ఫ్రెండ్స్‌‌పై ఆధారపడకూడదు. ఒకవేళ మోటివేషన్‌‌ కావాలనుకుంటే పర్సనల్‌‌ ట్రైనర్స్‌‌తో మాట్లాడాలి, లేదా ప్రోగ్రెస్‌‌ను ట్రాక్‌‌ చేసుకునేందుకు యాప్‌‌ను ఆశ్రయించాలని ఎక్స్‌‌పర్ట్స్‌‌ చెప్తున్నారు. మోటివేషన్‌‌ కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు. సోషల్‌‌ మీడియాలో ఇన్‌‌స్పిరేషనల్‌‌ పీపుల్‌‌ను ఫాలో అయితే సరిపోతుంది అంటున్నారు.

Tagged Yoga, exercise, Mistakes

Latest Videos

Subscribe Now

More News