చేతులు సరిగా కడుగుతున్నారా?

చేతులు సరిగా కడుగుతున్నారా?

రోజు మొత్తంలో కళ్లు ఎన్నింటిని చూస్తాయో, చేతులు అన్నింటిని తాకుతాయి. ఎక్కడెక్కడో చేతులు పెడతారు. తుమ్మినా దగ్గినా చేతుల్నే అడ్డు పెట్టుకుంటారు. అలానే కళ్లు, ముక్కు, చెవులు, నోటిని ముట్టుకుంటారు. అలాంటిది చేతులు సరిగ్గా కడుక్కోకుండానే అన్నం తింటారు. దాంతో చేతులపై ఉండే క్రిములు నేరుగా కడుపులోకి వెళ్లి రోగాలు తెస్తాయి. పెద్దవాళ్లకు ఇమ్యూనిటీపవర్ కాస్త ఎక్కువ ఉంటుంది. కాబట్టి, రోగాల నుంచి తప్పించుకోవచ్చు. కానీ, పిల్లల పరిస్థితి ఏంటి? కరోనా టైంలో శానిటైజర్, హ్యాండ్‌‌ వాష్‌‌లు వాడటం అలవాటు అయినా, ఇప్పుడు అది తగ్గింది. అసలే ఇప్పుడు రోగాలు వ్యాప్తి చెందే సీజన్‌‌. సరైన కేర్‌‌‌‌ తీసుకోక పోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకే అన్నం తినే ముందు, తిన్న తరువాత చేతుల్ని హ్యాండ్‌‌ వాష్‌‌తో శుభ్రంగా ఎలా కడుక్కోవాలో నేర్పించాలి తల్లిదండ్రులు. అందుకు  కొన్ని టిప్స్‌‌ ఫాలో కావాలి.

  • ముందు చేతుల్ని నీళ్లతో తడపాలి. గోరు వెచ్చని నీళ్లైతే ఇంకా బెటర్‌‌‌‌. తరువాత హ్యండ్ వాష్‌‌ లేదా సబ్బు తీసుకొని చేతులకి బాగా రుద్దాలి. చేతుల వెనకా ముందు, గోర్లు, వేళ్ల  సందుల్లో కూడా బాగా రుద్దాలి. అలా దాదాపు 20 సెకండ్లయినా చేతుల్ని సబ్బుతో కడగాలి. తరువాత నీళ్లతో కడిగేసి శుభ్రంగా ఉన్న, పొడి టవల్‌‌తో తుడవాలి.
  • పిల్లలు చేయి కడగటం పూర్తయ్యే వరకు వాళ్ల పక్కనే ఉండాలి. కెమికల్​ పవర్​ తక్కువ ఉండే హ్యాండ్‌‌ వాష్‌‌లు వాడితే  పిల్లల చర్మం రఫ్‌‌ కాదు.