మీ పిల్లలు బరువు తక్కువగా ఉన్నారా..ఇలా చేయండి..ప్రయోజనాలుంటాయి

మీ పిల్లలు బరువు తక్కువగా ఉన్నారా..ఇలా చేయండి..ప్రయోజనాలుంటాయి

కొంత మంది తమ పిల్లలు బరువు తక్కువగా ఉన్నారని ఆందోళన చెందుతుంటారు. బరువు తక్కువగా ఉండటం అనేది ఆరోగ్య సమస్యలు కూడా తెచ్చిపెడుతుంది. ఇది పెద్దవాళ్లేకాదు .. చిన్న పిల్లల్లో కూడా జరుగుతుంది. అప్పుడు  పిల్లలను న్యూట్రిషనిస్టులకు చూపించి వారు ఇచ్చే సలహాలు పాటించారు. దీంతోపాటు తల్లిదం డ్రులు వారి తక్కువ బరువున్న  చిన్నారులు ఎత్తు, వయసుకు తగిన బరువుండాలంటే ఏం చేయాలి.. ఎలాం ఫుడ్ ఇవ్వాలివంటి విషయాలను తెలుసుకుందాం.. 

పిల్లలు తక్కువ తింటున్నారు.. బరువు పెరగడం లేదు అనే ఆందోళన  చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంటుంది. ఎలాగైన వారికి ఆహారం తినిపించాలి.. ఇలా చేస్తే బరువు పెరుగుతారు అని  బలవంతంగా ఆహారం తినిపిస్తుంటారు. అలా చేస్తే పిల్లల్లో తినాలనే ఆసక్తి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దీంతో తినకుండా మొండికేసే అవకాశం ఉంటుంది. దీంతో పిల్లలు మరింత బరువు తగ్గేలా చేస్తుంది.  అందుకే పిల్లలను తినే విషయంలో బలవంతం పెట్టొద్దు. పిల్లల ఆహారం విషయంలో ఓ ప్రణాళికను సిద్దం చేసుకోవాలి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఎలాంటి ఆహారం ఇవ్వాలో టేబుల్ వేసుకొని సిద్దం చేసుకోవాలి. ఇలా చేస్తే బరువు తక్కువగా ఉన్న పిల్లలు బరువు పెరిగే అవకాశం ఉంటుంది. 

కొంతమంది పిల్లలు టీవీ చూస్తూనో.. లేక సెల్ ఫోన్లు చూస్తూనో ఫుడ్ తీసుకుంటుంటారు. ఇలా తినడం వల్ల తినడం పై కన్నా టీవీమీదే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఏం తింటున్నారు.. ఎంత తింటున్నారో కూడా పట్టించుకోరు.అందులో టేస్ట్ కూడా తెలియదు. అలాంటి పిల్లలు మరింత బరువు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా తినేటప్పుడు పిల్లలను టీవీలు, సెల్ ఫోన్లకుదూరంగా ఉంచాలి. మంచి రుచి, రంగు, వాసన ఉండేలా ఆహార పదార్థాలు తయారు చేయాలి. తినే ఆహారం గురించి వారికి అవగాహన కల్పించాలి. ఇలా చేస్తూ వారికి తినే పదార్థాల పట్ల ఆసక్తి పెరిగి ఎక్కువగా తింటారు.. బరువు పెరిగే అవకాశం ఉంటుంది. 

పిల్లలు బరువు పెరగాలంటే.. వారికి ఎక్కువ క్యాలరీలుంటే ఆహారం ఇవ్వాలి. చిక్కటి పాలు, పెరుగు, నెయ్యి వంటి పదార్థాలతో పాటు పండ్లు, కూరగాయలు డైలీ ఫుడ్ లో అందుబాటులో ఉంచాలి. ప్రతిరోజు బరువు తక్కువగా ఉన్న పిల్లలకు ఇవి అందిస్తే తప్పకుండా బరువు పెరిగే అవకాశం ఉంటుంది.