Argentina protest: లైవ్ లో లైంగిక వేధింపులు..ముగ్గురు యువతుల హత్య..అర్జెంటీనాలో పార్లమెంటును తాకిన నిరసనలు

Argentina protest: లైవ్ లో లైంగిక వేధింపులు..ముగ్గురు యువతుల హత్య..అర్జెంటీనాలో పార్లమెంటును తాకిన నిరసనలు

లైవ్​ లో లైంగిక వేధింపులు, ముగ్గురు యువతులు హత్య అర్జెంటీనాలో సంచలనంగా మారింది. యువతులను లైంగికంగా వేధిస్తూ..అనంతరం హత్యను సోషల్​మీడియాలో ప్రసారం చేయడం దేశవ్యాప్తంగా నిసనలకు దారితీసింది. ముగ్గురు యువతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది అర్జెంటీనా ప్రజలు బ్యూనస్ ఎయిర్స్ వీధుల్లో భారీ ర్యాలీ చేశారు. 

హత్యకు గురైన మోరెనా, బ్రెండా డెల్​ కాస్టిలో, లారా గుటియెర్రెజ్​యువతులకు న్యాయం చేయాలని వేలాది మంది ప్రజలు పెత్త ఎత్తున వీధుల్లోకి వచ్చారు. లారా, బ్రెండా, మోరెనా ఫొటోలతో ప్లకార్డుల ప్రదర్శిస్తూ పార్లమెంట్​ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇది నార్కో స్త్రీ హత్య,మా జీవితాలు వాడి పారేయలేనివి అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకొని మహిళలు నిరసనలు తెలిపారు.  

అసలేం జరిగిందంటే.. 

సెప్టెంబర్​ 19న పార్టీ పేరు చెప్పి మోరెనా, బ్రెండా డెల్​ కాస్టిలో, లారా గుటియెర్రెజ్ లను నమ్మించి ఓ వ్యాన్ లో కిడ్నాప్​ చేశారు నిందితులు. ​ముగ్గురు యువతులను వేళ్లు నరికి, గోళ్లు తీసి, దారుణంగా చంపేశారు. ఈ దారుణానికి పాల్పడుతూ సోషల్​ మీడియా ఇన్ స్టాగ్రామ్​ లో లైవ్​ పెట్టారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 

సెప్టెంబర్ 24న  బుధవారం ముగ్గురు యువతులమృతదేహాలను బ్యూనర్​ ఎయిర్స్​ లోని దక్షిణ శివారులో ఓ ఇంట్లో పాతిపెట్టినట్టు గుర్తించారు. మృతులకు మాదక ద్రవ్యాల విక్రయించే ముఠాతో సంబంధం ఉన్నట్లు ..ముఠా రూల్స్​ బ్రేక్​ చేస్తే ఇలాగే ఉంటుంది.. మా నుంచి డ్రగ్స్​ ఎవరూ దొంగిలించలేరంటూ  ఈ దారుణానికి పాల్పడిన దుండగుల్లో ఒకరు లైవ్​ లో చెప్పినట్లు తెలుస్తోంది. 

ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురు నిందితులను అరెస్ట్​ చేశారు పోలీసులు. నిందుతుల్లో ముగ్గురు యువకులు, ఇద్దరు యువతులు ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం బొలివియాలో మరో నిందితుడిని అరెస్ట్​ చేశారు. ప్రధాన నిందితుడుగా భావిస్తున్న 20 యేళ్ల పెరువియన్​కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

అయితే చనిపోయిన ముగ్గురు యువతులకు మాదకద్రవ్యాలు, వేశ్యవృత్తికి సంబంధం ఉన్నట్లు వస్తున్న ఆరోపణలు వారి కుటుంబ సభ్యులు తోసిపుచ్చారు. నిజాలు బయటపెట్టి తమకు న్యాయం చేయాలని నిరసనలకు దిగారు. 

ఈ దారుణమైన కేసు అర్జెంటీనా దేశవ్యాప్తంగా స్త్రీ హత్య,లింగ వివక్ష,హింసపై ఆగ్రహాన్ని రేకెత్తించింది. మహిళల రక్షణ, నిందితులకు కఠిన శిక్ష విధించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.