మెక్సికోపై గెలిచిన అర్జెంటీనా

మెక్సికోపై గెలిచిన అర్జెంటీనా

ఫీఫా వరల్డ్ కప్ లో నిన్న రాత్రి జరిగిన మెక్సికో, అర్జె్ంటీనా మ్యాచ్ లో 2-0 గోల్స్ తేడాతో అర్జెంటీనా జట్టు విజయం సాధించింది. తొలి మ్యాచ్ లో పసికూన సౌదీ అరేబియాతో ఓడిపోయిన అర్జెంటీనా, మెక్సికోతో జరిగిన మ్యాచ్ లో అదరగొట్టింది. మ్యాచ్ మొదటి అర్ధభాగం నుంచి  అర్జెంటీనా దూకుడుగా ఆడినా, ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది.

రెండవ అర్ధభాగంలో 64వ నిమిషంలో మెస్సీ.. ఏంజెల్ డి మారియా ఇచ్చిన పాస్ తో 25 మీటర్ల నుండి మొదటి గోల్ చేశాడు. తర్వాత 87వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన ఎంజో ఫెర్నాండెజ్‌ రెండో గోల్‌ చేసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రపంచ కప్ లో మెస్సీకి ఇది రెండవ గోల్.