బీఆర్ఎస్ -కాంగ్రెస్‌ నాయకుల మధ్య వాగ్వాదం

బీఆర్ఎస్ -కాంగ్రెస్‌ నాయకుల మధ్య వాగ్వాదం

వైరాఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అఖిలపక్ష నాయకులతో జరుగుతున్న సమావేశం రసాభాస నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయ భాయ్‌పై ఎమ్మెల్యే రాములు నాయక్ మండిపడ్డారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గందరగోళంతో బీఆర్ఎస్ -కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తతకు దారి తీసింది.

ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్‌కు వెళ్లి రహదారి విస్తరణ పనుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. పాలకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులకు సంబంధించిన షాపులు తొలగించకుండా.. అక్రమంగా ఒక వైపే తొలగించారని గత రెండు, మూడు రోజుల నుంచి అఖిలపక్ష నాయకులు ఆధ్వర్యంలో ఆందోళనలు ధర్నాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాములు నాయక్ అఖిలపక్షం నాయకులు కలిసి సమావేశం నిర్వహించారు.

ALSO READ :యూపీఏ హామీలిస్తే మేం చేసి చూపించాం: నిర్మలాసీతారామన్

రోడ్డు విస్తరణ పనులలో అందరికీ ఉపయోగపడేలాఉండాలని ఎమ్మెల్యే రాములు నాయక్ ను కోరారు. అయితే ఎమ్మెల్యే రాములు నాయక్‌తో మాట్లాడుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయభాయ్ ఎమ్మెల్యేతో మాట్లాడారు. 66 అడుగులకు ఆమోదం తెలిపిన తర్వాత ఇంకా అఖిలపక్షం కూర్చొని మాట్లాడవలసిన అవసరం ఏముందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని.. అదేవిధంగా వైరా మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ నేతలు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. దీంతో ఎమ్మెల్యే రాములు నాయక్ విజయభాయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అక్కడ గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రాములు నాయక్ అఖిలపక్షం సమావేశం నుంచి అభ్యంతరంగా వెళ్లిపోవడంతో.. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. స్థానిక పోలీసులు బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన గొడవను శాంతింప చేశారు.