
ఫామ్ హౌస్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదుపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి మొయినాబాద్ ఇన్స్పెక్టర్కు అర్హత లేదంటూ ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చిందని.. అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఎఫ్ఐఆర్ను ఏ పోలీస్ స్టేషన్ SHO అయినా నమోదు చేయవచ్చని ఆయన చెప్పారు. నిందితుల తరుపు న్యాయవాదులు ఈ అంశాన్ని లేవనెత్తారా అని హైకోర్టు ప్రశ్నించగా.. సీబీఐతో మాత్రమే దర్యాప్తు జరిపించాలని వారి వాదన అని ఏజీ కోర్టుకు తెలిపారు.
నిందితులపై అవినీతి నిరోధక చట్టం కింద తప్పుల తడక కేసు నమోదు చేశారని ప్రతిపాదిత న్యాయవాది రాంచందర్ రావ్ వాదనలు వినిపించారు. మొయినా బాద్ పోలీసుల పరిధిలోకి రాని సెక్షన్లను ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారని చెప్పారు. అవినీతి నిరోధక చట్టం కింద నేరం చేసినట్టు పోలీసులు భావిస్తే.. జీరో ఎఫ్ఐఆర్ చేసి కేసు బదిలీ చేయాల్సిందన్నారు. లా అండ్ ఆర్డర్ పోలీసులకు.. పీసీ యాక్ట్ లో విచారణ చేయాల్సిన అర్హత లేదని చెప్పారు. రాజేంద్రనగర్ ఏసీపీ పీసీ యాక్ట్ కింద నమోదైన కేసు.. దర్యాప్తు ఎలా చేస్తారని రాంచందర్ రావ్ ప్రశ్నించారు. కరప్షన్ యాక్ట్ సెక్షన్ 8 పెట్టడం పూర్తిగా విరుద్ధమని అన్నారు. 100 కోట్లు డీల్ జరిగింది అన్నప్పుడు స్వాధీనం చేసుకున్న డబ్బు చూపించాలి కదా అని చెప్పారు. భారీ కుట్రకు చెక్ పెట్టామని పోలీసులు అంటున్నారు.. అలా అయితే ఘటనా స్థలంలో 100 కోట్లు ఉంటే పోలీసులు డబ్బులు ఎందుకు బయట పెట్టలేదని రాంచందర్ రావ్ కోర్టులో వాదనలు వినిపించారు.