గవర్నర్ కోట ఎమ్మెల్సీల పిటిషన్పై.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

గవర్నర్ కోట ఎమ్మెల్సీల పిటిషన్పై.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

హైదరాబాద్​: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎన్నిక వివాదం పిటిషన్ పై హైకోర్టులో  వాదనలు ముగిసాయి. గవర్నర్ కోట ఎమ్మెల్సీల పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల తరపున తమ వాదనలు వినిపించారు. అనంతరం తీర్పును హైకోర్టు రిజర్వ్​ చేసింది.  

ఈ నేపథ్యంలో కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీ ఎన్నికపై స్టేటస్ కో కొనసాగనుంది. కాగా, గత ప్రభుత్వంలో నామినేటేడ్ కోటాలో బీఆర్ఎస్ నేతలు నేతలు కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌ల ఎన్నికను గవర్నర్ తమిళి‌సై నిరాకరించిన విషయం తెలిసిందే.

దీంతో  గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.  తమ ఎన్నికపై క్లారిటీ వచ్చే వరకు స్టే విధించాలని కోరారు. దీంతో కోర్టు స్టే విధించింది.