
‘కాంతార’ మొదలు ‘కల్కి 2898 ఏడీ’ వరకూ మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న సినిమాలకు చక్కని ప్రేక్షకాదరణ లభిస్తోంది. ఈ క్రమంలో అరిషడ్వర్గాలు, శ్రీకృష్ణుడి గొప్పతనం వంటి అంశాలతో ‘అరి’ అనే సినిమా వస్తోంది. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ట్యాగ్‌లైన్. వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
‘పేపర్ బాయ్’ ఫేమ్ జయశంకర్ దర్శకుడు. శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. మనిషి అంతర్గత శత్రువులుగా చెప్పబడే అరిషడ్వార్గాల (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు) కాన్సెప్ట్‌తో ఇండియన్ స్క్రీన్‌పై సినిమా రాలేదని, కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలియజేశారు.