OTT Horror: ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ హారర్ కామెడీ.. రోడ్డు మలుపులో కాపు కాసే దెయ్యం.. ట్విస్టులకు దిమ్మ తిరిగిపోద్ది

OTT Horror: ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ హారర్ కామెడీ.. రోడ్డు మలుపులో కాపు కాసే దెయ్యం.. ట్విస్టులకు దిమ్మ తిరిగిపోద్ది

టాలీవుడ్ ఆడియన్స్కు మలయాళ సినిమాలు వీపరీతంగా నచ్చేస్తున్నాయి. అక్కడీ మేకర్స్ తీసే సినిమాలకు మన తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. మలయాళ దర్శకులు రాసుకునే కథల్లో సహజత్వం, లొకేషన్స్, నటి నటుల పెర్ఫార్మన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతున్నాయి. ఈ క్రమంలోనే మలయాళ భాష నుంచి సినిమా వస్తుందంటే చాలు.. తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూడటం షురూ చేస్తున్నారు. అలా కొన్ని రోజుల నుంచి ఎదురుచూసిన మూవీ ఒకటి, ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఆ సినిమా ఏంటీ? ఏ జోనర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది? ఎలాంటి కథతో అలరిస్తుంది? అనేది ఓ లుక్కేద్దాం. 

లేటెస్ట్ మలయాళ హారర్ కామెడీ మూవీ సుమతి వలవు (Sumathi Valavu). సెప్టెంబర్ 26 న జీ5 ఓటీటీలోకి స్ట్రీమింగ్కి వచ్చేసింది. తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఓ రోడ్డు మలుపును కాపు కాసే దెయ్యం.. దానికి చిక్కిన వ్యక్తులు.. ఇదే ఈ సినిమా మెయిన్ స్టోరీ.

డిఫరెంట్ స్టోరీ లైన్తో వచ్చిన ఈ మూవీ ఆగస్టు 1న థియేటర్లలో రిలీజైంది. అక్కడి ఆడియన్స్లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. దిమ్మతిరిగే ట్విస్టులతో, థ్రిల్లింగ్ పెంచే స్క్రీన్ ప్లేతో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ దగ్గర రూ.25 కోట్లకుపై వసూళ్లు చేసి సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ మూవీలో అర్జున్ అశోకన్, మాళవిక మనోజ్, బాలు వర్గీస్, సిద్ధార్థ్ భరతన్, సైజు కురుప్, గోకుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సురేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రధాన పాత్రల్లో నటించారు.

స్థానిక జానపద కథలు, నిజ జీవిత ఘటనల ఆధారంగా విష్ణు శశి శంకర్ ఈ సినిమా తెరకెక్కించారు. కేరళలోని తిరువనంతపురం దగ్గర ఉన్న మైలమూడులో ఇదే పేరుతో ఓ ప్లేస్ ఉండటం విశేషం. అయితే, ఆ ప్రదేశంలో 1950ల్లో ప్రెగ్నెంట్గా ఉన్న సుమతి అనే అమ్మాయి హత్యకు అక్కడి స్థానికులు చెబుతారు. అప్పటి నుంచీ ఆ ప్రదేశంలో సుమతి ఆత్మ ఉందని, అక్కడే తిష్ట వేసిందని బలంగా నమ్ముతారు. ఇపుడు అలాంటి కథనంతోనే సినిమా రావడం ఆసక్తి పెంచింది. 

కథేంటంటే:

కేరళ–-తమిళనాడు సరిహద్దులో కల్లెలి అనే ఊరు ఉంటుంది. అది ఒక చిన్న గ్రామం. దానికి మూడు వైపులా ఫారెస్ట్ ఉంటుంది. ఊరి నుంచి రోడ్డు మార్గంలో కాస్త దూరం వెళ్తే ఒక టర్నింగ్ వస్తుంది.

చాలాకాలం క్రితం అక్కడ ‘సుమతి’ అనే అమ్మాయి చనిపోతుంది. ఆమె అక్కడే దెయ్యమై తిరుగుతోందని అందరూ నమ్ముతారు. అందుకే ఆ మలుపుని ‘సుమతి వలవు’ అని పిలుస్తుంటారు.

రాత్రి 8 గంటలు దాటిన తర్వాత ఆ ఊళ్లో ఎవరూ ఇల్లు దాటరు. అటువైపు వెళ్లకుండా ఊరి చివర ఒక  చెక్ పోస్టు కూడా ఏర్పాటు చేస్తారు. ఆ ఊరికి చెందిన మహేష్ (గోకుల్ సురేష్) అక్క ఒకరోజు రాత్రి తను ఇష్టపడిన వ్యక్తితో ఊరి నుంచి పారిపోతుంది. అయితే.. ఆ టైంలో సుమతి వలవును దాటడం అసాధ్యమని, ఆమె చనిపోయి ఉంటుందని అందరూ అనుకుంటారు.

మహేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్పు (అర్జున్ అశోకన్) ఆమెకి సాయం చేశాడని అందరూ నమ్ముతారు. అందుకే వాళ్ల ఫ్యామిలీ అప్పుని దూరం పెడుతుంది. రెండు కుటుంబాల మధ్య శత్రుత్వం పెరుగుతుంది.

ఆ తర్వాత మహేష్ బంధువు భామ (మాళవిక మనోజ్)ని అప్పు ప్రేమిస్తాడు. దాంతో కొత్త విభేదాలు తలెత్తుతాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు సుమతి కథ ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.