
విజయ రామరాజు హీరోగా నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’.విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో శ్రీని గుబ్బల నిర్మించారు. ఆగస్టు 29న సినిమా రిలీజ్. ఈ సందర్భంగా నిర్మాత శ్రీని గుబ్బల మాట్లాడుతూ ‘డైరెక్టర్ విక్రాంత్ చెప్పిన స్టోరీ నాకు చాలా నచ్చింది.
కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో కొన్ని చిత్రాలు వచ్చినా.. ఇందులో చూపించినంత సీరియస్‌గా ఇప్పటివరకు ఏ సినిమా రాలేదు. కచ్చితంగా ఒక బెంచ్ మార్క్ మూవీ అవుతుందని చాలెంజ్‌గా తీసుకుని చేశాం. నల్గొండలో కబడ్డీ ప్లేయర్ నాగులయ్య. అతనిని అర్జున్ అని కూడా పిలుస్తారు.
ఆయన జీవితంలోని రియల్ ఇన్సిడెంట్స్ అరవై శాతం ఉంటే నలభై శాతం ఫిక్షన్‌ను జోడించి కథను రెడీ చేశారు విక్రాంత్. క్రియేటివ్ సైడ్ దర్శకుడికి పూర్తిగా ఫ్రీహ్యాండ్ ఇచ్చాం. ఇందులో హీరోకి నాలుగైదు ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క క్యారెక్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు తొమ్మిది నెలల సమయం పట్టేది.
అర్జున్ పాత్ర కోసం విజయ రామరాజు చాలా కష్టపడ్డాడు. ఈ సినిమాని అథెంటిక్‌గా తీసి ఇంటర్నేషనల్‌గా తీసుకెళ్లాలని భావించాం. పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించినప్పుడు అందరూ అభినందించారు. 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి.
దర్శకుడు హను రాఘవపూడి టీజర్ రిలీజ్ చేసి చాలా ఇంప్రెస్ అయ్యారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 16 మిలియన్లు వ్యూస్ తెచ్చుకుంది. అలాగే, యూట్యూబ్‌లో 1.5 మిలియన్లు వ్యూస్‌ను క్రాస్ చేసేసింది. మన దేశంలోని మెట్రో సిటీస్‌తో పాటు యూఎస్, యూకే, యూరప్, సౌత్ ఆఫ్రికాలోనూ సినిమా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాం’అని అన్నారు.