ఫిడే చెస్ వరల్డ్‌‌‌‌ కప్‌ ప్రిక్వార్టర్స్‌‎ను డ్రాతో ప్రారంభించిన అర్జున్, హరి

 ఫిడే చెస్ వరల్డ్‌‌‌‌ కప్‌ ప్రిక్వార్టర్స్‌‎ను డ్రాతో ప్రారంభించిన అర్జున్, హరి

పనాజీ: ఫిడే చెస్ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‎ను తెలంగాణ కుర్రాడు ఎరిగైసి అర్జున్, ఏపీ గ్రాండ్ మాస్టర్ పి. హరికృష్ణ  డ్రాతో ప్రారంభించారు. శుక్రవారం జరిగిన  తొలి రౌండ్‌‌‌‌లో  అర్జున్.. డబుల్ వరల్డ్ కప్ విన్నర్  లెవోన్ అరోనియన్‌‌‌‌ (అమెరికా)తో పాయింట్ పంచుకున్నాడు. తెల్ల పావులతో ఆడిన అర్జున్ ఎండ్ గేమ్‌‌‌‌లో స్వల్ప ఆధిక్యం సాధించినా
అరోనియన్ డిఫెన్స్‌‌‌‌ ఛేదించలేకపోయాడు. దాంతో 41 ఎత్తుల అనంతరం ఇరువురు ఆటగాళ్లు డ్రాకు అంగీకరించారు. మరోవైపు నల్ల పావులతో ఆడిన హరికృష్ణ  ఎడ్వర్డో మార్టినెజ్ (మెక్సికో)కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా 41 ఎత్తుల్లో గేమ్‌‌‌‌ను డ్రా చేసుకున్నాడు.