
యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ పెళ్లి వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ తమిళ హాస్యనటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి రామయ్యతో ఐశ్వర్య వివాహం త్వరలో జరగబోతోంది. ఈ విషయాన్ని తంబి రామయ్యే స్వయంగా ప్రకటించారు.
ఈ ఏడాది నవంబర్ 8న పెళ్లి డెట్ ఫిక్స్ చేస్తామని ఆయన వెల్లడించారు. ఎందుకంటే ఆ రోజున ఉమాపతి బర్త్ డే కాబట్టి . దాదాపుగా వచ్చే ఏడాది వీరిద్దరి వివాహం జరగవచ్చునని తెలుస్తోంది. గత కొంతకాలంగా ఉమాపతి రామయ్య, ఐశ్వర్య అర్జున్ ప్రేమలో ఉన్నారు. తాజాగా వీరి ప్రేమకు పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఐశ్వర్య అర్జున్ 2013లో నటిగా అరంగేట్రం చేసింది. ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాన్ని అందుకోలేకపోయింది. ఆమె చివరిగా తన తండ్రి అర్జున్ సర్జా దర్శకత్వం వహించిన తమిళ-, కన్నడ ద్విభాషా చిత్రం ప్రేమ బరాహాలో కనిపించింది. ఈ చిత్రం కర్ణాటకలో విజయవంతం అయింది.
ఇక ఉమాపతి 2017లో అడగపట్టదు మగజనంగాలేతో అరంగేట్రం చేశాడు. అర్జున్ సర్జా హోస్ట్ చేసిన అడ్వెంచర్ ఆధారిత రియాలిటీ షో సర్వైవర్‌లో కనిపించాడు. ప్రస్తుతం 'దేవ్‌దాస్' అనే సినిమాలో నటిస్తున్నాడు.