అర్జున్ టెండూల్కర్‌‌ను ముంబై కొనడానికి కారణమదేనట

అర్జున్ టెండూల్కర్‌‌ను ముంబై కొనడానికి కారణమదేనట

ఐపీఎల్‌ మినీ వేలంలో కొత్త రికార్డులు బ్రేక్ అయ్యాయి. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్‌‌ రూ.16.25 కోట్లకు అమ్ముడుపోయి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆసీస్ ప్లేయర్లు మ్యాక్స్‌వెల్, రిచర్డ్‌‌సన్ కూడా భారీ ధరకు అమ్ముడుపోయారు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌‌ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌ కూడా ఈ ఏడాది ఐపీఎల్‌‌లో ఆడనున్నాడు. కనీస ధర రూ.20 లక్షలకు ఈ 21 ఏళ్ల లెఫ్టార్మ్ మీడియం పేసర్‌‌ను ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. అర్జున్ టెండూల్కర్‌‌ను తమ జట్టులోకి తీసుకోవడంపై ముంబై ఇండియన్స్ కోచ్ మహేళ జయవర్దనే స్పందించాడు. ట్యాలెంట్ ఉంది కాబట్టే అర్జున్‌‌ను తీసుకున్నామని జయవర్దనే అన్నాడు.

‘మేం నైపుణ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తాం. సచిన్ కొడుకు కాబట్టి అర్జున్‌‌పై చాలా ఒత్తిడి ఉంటుంది. అదృష్టమేమంటే అతడు బ్యాట్స్‌‌మెన్ కాదు బౌలర్. అతడ్ని ట్యాలెంట్ చూసే తీసుకున్నాం. అర్జున్‌‌కు ఇది నేర్చుకునే సమయం. అతడు ఈమధ్యే ముంబైకి ఆడటాన్ని మొదలుపెట్టాడు. ఇప్పుడు ఫ్రాంచైజీ క్రికెట్ ఆడబోతున్నాడు. నేర్చుకోవడానికి, సాధన చేయడానికి, ఓ ప్లేయర్‌గా ఎదగడానికి ఇదే కరెక్ట్ టైమ్. అతడు ఇంకా యువకుడే. అతడికి ఎదిగేందుకు సమయం ఇవ్వాలి. ఎక్కువ ఒత్తిడి పెట్టకూడదు’ అని జయవర్దనే చెప్పాడు.