ఇదెక్కడి ఓవరాక్షనండి బాబూ..పబ్ను దోచుకున్న దొంగ..డ్రోన్లు, బాంబు స్క్వాడ్లతో పోలీసుల హల్చల్

ఇదెక్కడి ఓవరాక్షనండి బాబూ..పబ్ను దోచుకున్న దొంగ..డ్రోన్లు, బాంబు స్క్వాడ్లతో పోలీసుల హల్చల్

పావలా కోడికి..బారానా మసాలా అనే సామెత మీరు వినే ఉంటారు.. బెంగళూరులో జరిగిన ఓ చోరీ ఘటనకు ఇది సరిగ్గా సరిపోతుందటనుకుంది. ఓ పబ్ లో చొరబడిన దొంగ సీసీ కెమెరాలు పగలగగొట్టి చోరీకి పాల్పడ్డాడు.. పబ్ సిబ్బంది పోలీసులకు ఫోన్ చేశారు..రోటీన్ పోలీసులు వచ్చారు. ఇక్కడివరకు బాగానే ఉంది.. ఆ తర్వాత పోలీసులు చేసిన హల్ చల్ చూస్తూ ఈ సామెత గుర్తొకొస్తుంది. వివరాల్లోకి వెళితే..      

సోమవారం తెల్లవారు జామున (మే 12) బెంగళూరులోని జియోమెట్రిక్ పబ్ లో చొరబడిన దొంగ చోరీకి పాల్పడ్డాడు. పబ్ వెనకడోర్ నుంచి లోపలికి వచ్చిన దొంగ సీసీ కెమెరాలు పగలగొట్టి డ్రాలో ఉన్న రూ. 50వేల నగదు ఎత్తుకెళ్లాడు. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న పిస్టల్తో సిబ్బందిని బెదిరించి పరారయ్యాడు. పబ్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తనిఖీలతో హల్ చల్ చేశారు.  

ALSO READ | అదృష్టాన్ని పట్టేశాడబ్బా:ఆ లాటరీపై15 ఏళ్లుగా ప్రయత్నం..ఎట్టకేలకు రూ.8 కోట్లు గెలిచిన ఇండియన్..

స్థానిక గస్తీ పోలీసులు, క్విక్ రెస్పాన్స్ టీం (QRT) సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. సుబ్రమణ్య నగర్ పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాంగణంలో తనిఖీలు చేశారు. తనిఖీలకు డ్రోన్లను మోహరించారు. ఏవైనా భద్రతా బెదిరింపులు ఉన్నాయా అనే కోణంలో సెర్చింగ్ చేశారు. ముందు జాగ్రత్త చర్యగా D స్క్వాడ్ ,బాంబు స్క్వాడ్‌ను పంపారు.

ఇక పోలీసులు ఎంత గాలించినా దొంగ మాత్రం దొరకలేదు. క్యూఆర్ టీ  టీం వచ్చి భవనం మొత్తం చెక్ చేసి పబ్ లో అనుమానితులు ఎవరూ లేరని తేల్చింది. ఇంకేముంది చేసేదేమీ లేక.. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో హడావుడి ముగిసింది.