మలి దశ ఉద్యమానికి నిజామాబాద్ పసుపు రైతులు రెడీ

మలి దశ ఉద్యమానికి నిజామాబాద్ పసుపు రైతులు రెడీ

నిజామాబాద్ జిల్లా అర్మూర్ పట్టణం మార్కెట్ యార్డులో రైతుల కార్యాచరణ సమావేశం జరిగింది. పసుపుబోర్డుకోసం మలి దశ ఉద్యమ కార్యాచరణపై రైతులు చర్చించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తమకు ఇచ్చిన మాటను పట్టించుకోవడం లేదని .. గెలిచిన నెలరోజుల్లో పసుపు బోర్డు మంజూరు చేయిస్తానన్న మాట నిలబెట్టుకోలేదని రైతులు సీరియస్ అయ్యారు.

పసుపు బోర్డు, పసుపుకు మద్దతు ధర సాధన కోసం మరో పోరాటం చేయాలని నిర్ణయించారు. పార్టులతో సంబంధం లేకుండా ఉద్యమం ఉదృతం చేయాలని రైతులు నిర్ణయించారు.