- ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి
ఆర్మూర్, వెలుగు: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కేంద్రంలోని లెదర్ పార్క్ స్థలాన్ని కాపాడాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం పార్క్స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడారు. పార్క్ స్థలంలో నివాసముంటున్న నిరుపేదలకు ఇతర ప్రభుత్వ స్థలంలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
మైనింగ్ రూల్స్ ప్రకారమే మొరం తవ్వకాలు జరిగేలా చూడాలని, పర్మిషన్ లేకుండా తవ్వకాలు చేస్తే జరిమానాలు విధించాలని ఆదేశించారు. సుందరయ్య కాలనీలో నివాసముంటున్న పేదలకు శాశ్వత పరిష్కారం కోసం విధివిధానాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలన్నారు. సబ్ కలెక్టర్ అభిగ్యాన్మాల్వియా, తహసీల్దార్ సత్యనారాయణ, కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
