ఆర్మూర్, వెలుగు: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మగ్గిడి, ఆలూర్మండలం దేగాం గ్రామాల్లో ఇటుకబట్టిలో వెట్టి చాకిరి నుంచి విముక్తి అయిన కార్మికులపై గురువారం ఆర్మూర్సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి సమావేశమయ్యారు. తమిళనాడు, ఆంధ్రకు చెందిన 37 మంది కార్మికులకు రిలీఫ్ సర్టిఫికెట్స్ అందజేశారు.
ఇందులో 22 మంది కార్మికులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ద్వారా రూ.30వేల చొప్పున పరిహారం ఇచ్చారు. వీరిలో నలుగురు బాలకార్మికులను గుర్తించారు. అనంతరం వారిని బస్సుల్లో స్వస్థలాలకు పంపించారు. తహసీల్దార్ సత్యనారాయణ, లేబర్ డిప్యూటీ కమిషనర్ యాదయ్య, అసిస్టెంట్ కమిషనర్ శ్రావణి, ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు.
