ఆర్మూర్, నిర్మల్ రైల్వే లైన్ కు డీపీఆర్ .. నిధుల మంజూరుకు రైల్వే శాఖ మంత్రి హామీ

ఆర్మూర్, నిర్మల్ రైల్వే లైన్ కు డీపీఆర్ .. నిధుల మంజూరుకు రైల్వే శాఖ మంత్రి హామీ

నిర్మల్, వెలుగు: ఆర్మూర్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు చేపట్టనున్న రైల్వే లైన్ నిర్మాణ పనులకు అవసరమైన నిధులు మంజూరు చేస్తానని రైల్వే శాఖ మంత్రి హామీ ఇచ్చారని, డీపీఆర్ కూడా సిద్ధమైందని బీజేఏల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ రైల్వే లైన్​కు సంబంధించి శనివారం రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ డీపీఆర్​లపై రివ్యూ నిర్వహించారని తెలిపారు. ఇప్పటికే సర్వే పనులు పూర్తికావడంతో డీపీఆర్ ను రూపొందించి తమకు పంపాలని సంబంధిత అధికారులను రైల్వే శాఖ మంత్రి ఆదేశించారని అన్నారు. 

డీపీఆర్ అందగానే ఆర్థిక అనుమతులన్నీ మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారని వెల్లడించారు. రైల్వే లైన్​ కోసం ఈ ప్రాంత ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారని అందుకే మోదీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. నిర్మల్ ప్రజల దీర్ఘకాల కోరిక నెరవేరబోతోందన్నారు. మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ చంద్రరావు, ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, రైల్వే అధికారులు సమావేశంలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు.