ఆదిలాబాద్ లో భారీగామద్యం పట్టివేత.. ఓటర్లకు పంచుతుండగా సీజ్ 

ఆదిలాబాద్ లో భారీగామద్యం పట్టివేత.. ఓటర్లకు పంచుతుండగా సీజ్ 

మున్సిపల్ ఎన్నికల వేళ  మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మద్యం ఏరులై పారుతోంది. మద్యం పంచడం ద్వారా ఓటర్లను ప్రలోభపెట్టేందులు కొందరు అభ్యర్థులు తీవ్రంగా  ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో భారీగా మద్యం పట్టుబడింది. ఆదిలాబాద్ పట్టణం కేంద్రంలో భారీ ఎత్తున మద్యం బాటిళ్లను  పట్టుకున్నారు పోలీసులు. 

ఆదిలాబాద్ పట్టణంలో మంగళవారం (ఫిబ్రవరి 10) పోలీసులు భారీ ఎత్తున మద్యం పట్టుకున్నారు. బుధవారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులు చేస్తున్న ప్రయత్నాలకు పోలీసులు అడ్డుకట్ట వేశారు.  

పట్టణంలో  ఓటర్లకు పంచుతుండగా 287 లీటర్ల  మద్యాన్ని సీజ్ చేశారు. పట్టుకున్న మద్యం విలువ రూ. 3లక్షలు ఉంటుందని అంచాన వేశారు.  36 కేసులు నమోదు చేసి 46 మందిని అదుపులోకి తీసుకున్నారు. 

ఎన్నకల కమిషన్ ఆదేశాల మేరకు  ఆదిలాబాద్ పట్టణాన్ని నిఘా ఉంచారు పోలీసులు.డబ్బు, మద్యం పంపిణీ జరగకుండా స్పెషల్ టీమ్స్ తనిఖీలు చేస్తున్నాయి