కుక్కను కాపాడి మంటల్లో కాలిపోయిన ఆర్మీ మేజర్

కుక్కను కాపాడి మంటల్లో కాలిపోయిన ఆర్మీ మేజర్

ప్రేమగా పెంచుకుంటు న్న కుక్కను కాపాడే ప్రయత్నంలో ఆర్మీ మేజర్ ఒకరు సజీవంగా దహనమయ్యాడు. కుక్క క్షేమంగా బయటపడ్డా.. మేజర్ మాత్రం తొంబై శాతం కాలిన గాయాలతో స్పాట్ లోనే ప్రాణాలొదిలారు. జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లా గుల్మార్గ్​లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.గుల్ మార్గ్​లోని మేజర్ అంకిత్ బుధరాజా ఇంట్లో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఎగిసి పడుతుండడంతో పడుకున్న వాళ్లంతా బయటికి పరుగులు తీశారు. ఈ హడావుడిలో పెంపుడు కుక్కలను వెంట తీసుకెళ్లేందుకు మేజర్ ప్రయత్నించాడు. రెండు కుక్కల్లో ఒక దానిని క్షేమంగా బయటికి తీసుకొచ్చాడు.తర్వాత రెండో కుక్కను తీసుకొచ్చేందుకు మళ్లీ లోపలికి వెళ్లాడు. అప్పటికే మంటలు చుట్టుముట్టడంతో బయటికి రాలేకపోయారు. కుక్కను బయటికి విసిరేసి తాను మాత్రం మంటల్లో చిక్కుకుపోయాడు. అతి కష్టం మీద బయటికి వచ్చే సరికి అతని శరీరం 90 శాతం కాలిపోయింది.బయటపడిన కాసేపటికే మేజర్ కన్నుమూశాడని పోలీసులు చెప్పారు.