పాకిస్థాన్‌పై భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసిందా .. క్లారిటీ ఇచ్చిన రక్షణ మంత్రిత్వ శాఖ

పాకిస్థాన్‌పై భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసిందా ..  క్లారిటీ  ఇచ్చిన రక్షణ మంత్రిత్వ శాఖ

పాకిస్థాన్‌పై భారత్ మరో సర్జికల్ స్ట్రైక్ చేసిందని వచ్చిన వార్తలను రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది.  జమ్మూ కాశ్మీర్‌లోని బాలాకోట్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వద్ద 2023 ఆగస్టు 22 మంగళవారం ఉదయం దట్టమైన పొంగమంచు వాతావరణం అలుముకుంది. దీనిని అనుకూలంగా భావించిన ఇద్దరు ఉగ్రవాదులు భారత్ లోకి చోరబడేందుకు ప్రయత్నించారు . వీరిని సైన్యం గుర్తించి చొరబాటు ప్రయత్నాన్ని విఫలం చేసింది. అయితే ఇది సర్జికల్ స్ట్రైక్ కాదని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇండియన్ ఆర్మీ కూడా అదే చెప్పింది. 

ALSO READ : కొవిడ్ కొత్త వేరియంట్లపై అలర్ట్.. కేంద్రం ఉన్నత స్థాయి సమావేశం

 పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులో మరోసారి భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేసిందని మంగళవారం ఉదయం ఓ వార్తా పత్రిక తెలిపింది. భారత సైన్యం శనివారం రాత్రి ఎల్ఓసీ వెంబడి పాక్ ఆక్రమిత కశ్మీరులోకి 2.5 కిలోమీటర్లు వెళ్లి, పాకిస్థానీ ఉగ్రవాదులకు చెందిన నాలుగు లాంచింగ్ పాడ్‌లను ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఈ దాడిలో ఎనిమిది మంది ఉగ్రవాదులు మరణించినట్లుగా వెల్లడించింది.  భారత సైనికులంతా సురక్షితంగా తిరిగి వచ్చారంది. అయితే దీనిపై రక్షణ మంత్రిత్వ శాఖ ఈ వివరణ ఇచ్చింది.