
న్యూఢిల్లీ: భారత సైన్యం అమ్ముల పొదిలోకి ఎట్టకేలకు అత్యాధునిక అపాచీ హెలికాప్టర్లు చేరనున్నాయి. 15 నెలల ఆలస్యం తర్వాత తొలుత ఈ నెల 22న అమెరికానుంచి మూడు అపాచీ ఏహెచ్64ఈ హెలికాప్టర్లు రానున్నాయని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. మొత్తం ఆరు హెలికాప్టర్ల కోసం భారత సైన్యం 2020లో అమెరికాతో 600 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నది.
2024 ప్రారంభంలో, మే, జూన్ మధ్య ఈ విమానాలను డెలివరీ చేయాల్సి ఉంది. అయితే, సాంకేతిక కారణాలతో ఇది జులై 2025కు వాయిదా పడింది. మరో మూడు అపాచీ హెలికాప్టర్లు ఈ ఏడాది చివర్లో రానున్నాయి.