పసికందుకు ఊపిరి పోశారు..‘వీ6 వెలుగు’ స్టోరీకి స్పందించిన ఆరోగ్య శ్రీ ఆఫీసర్లు

పసికందుకు ఊపిరి పోశారు..‘వీ6  వెలుగు’ స్టోరీకి స్పందించిన ఆరోగ్య శ్రీ ఆఫీసర్లు
  • హైదరాబాద్‌‌లోని స్టార్‌‌ హాస్పిటల్‌‌లో హార్ట్‌‌ సర్జరీ

కరీంనగర్, వెలుగు : గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఏడు నెలల పసికందుకు ‘ఆరోగ్య శ్రీ’ ద్వారా హైదరాబాద్‌‌లోని స్టార్‌‌ చిల్డ్రన్స్‌‌ హాస్పిటల్‌‌ ఊపిరి పోసింది. ‘మా బాబుకు ఊపిరి పోయండి’ అనే హెడ్డింగ్‌‌తో ఈ నెల 1న ‘వీ6 వెలుగు’లో పబ్లిష్‌‌ అయిన వార్తకు ఆరోగ్య శ్రీ ఆఫీసర్లు స్పందించి ట్రీట్‌‌మెంట్‌‌ కోసం చర్యలు తీసుకున్నారు. మానకొండూరు మండలం చెంజర్ల గ్రామానికి చెందిన రామగిరి శ్వేత, అంజయ్య దంపతుల కుమారుడు శ్రీవాగ్మిన్‌‌ అవ్యక్త్ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతుండగా.. ట్రీట్‌‌మెంట్‌‌ కోసం ఇప్పటికే రూ.11 లక్షల వరకు ఖర్చు చేశారు. 

మరో ఫేస్‌‌ మేకర్‌‌ సర్జరీకి రూ.8 లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పడంతో వారు కలెక్టర్‌‌కు కలిశారు. ఇదే విషయంపై ‘వీ6 వెలుగు’లో కథనం రావడంతో స్పందించిన ఆఫీసర్లు.. జిల్లా కోర్డినేటర్, డిస్ట్రిక్ట్ మేనేజర్‌‌కు సమాచారం ఇచ్చి హైదరాబాద్‌‌లోని స్టార్‌‌ చిల్డ్రన్స్‌‌ హాస్పిటల్‌‌కు తీసుకురావాలని సూచించారు. అక్కడ ఈ నెల 14న ఫ్రీగా ఆపరేషన్‌‌ చేశారు. ప్రస్తుతం బాబు పరిస్థితి మెరుగ్గా ఉందని డాక్టర్ చెప్పారు. తమ బాబు పరిస్థితిపై వార్త రాసిన ‘వీ6 వెలుగు’కు, స్పందించిన కలెక్టర్, ఆరోగ్యశ్రీ ఆఫీసర్లకు తల్పిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.