ఇవాళ బీజేపీ ఆఫీస్​ బేరర్ల మీటింగ్‌‌

ఇవాళ బీజేపీ ఆఫీస్​ బేరర్ల మీటింగ్‌‌
  • హాజరుకానున్న తరుణ్​ చుగ్
  • పార్టీలో చేరికలు, మోడీ 8 ఏండ్ల పాలనపై చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చ

హైదరాబాద్ : బీజేపీలో చేరికలను స్పీడ్ అప్ చేయడం, ప్రధాని నరేంద్ర మోడీ ఎనిమిదేండ్ల పాలన పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించేందుకు రాష్ట్ర ఆఫీసు బేరర్ల సమావేశం సోమవారం పార్టీ స్టేట్ ఆఫీసులో జరగనుంది. పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి తరుణ్ చుగ్, పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాశ్​, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ కోర్ కమిటీ మెంబర్ వివేక్ వెంకటస్వామి, నేతలు లక్ష్మణ్​, డీకే అరుణ, విజయశాంతి, రాష్ట్ర ఆఫీసు బేరర్లు, అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, జిల్లాల ఇన్​చార్జులు హాజరుకానున్నారు. సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఎప్పటి నుంచి, ఎక్కడ్నుంచి కొనసాగించాలనే విషయంపైనా ఈ మీటింగ్ లో ఫైనల్ చేయనున్నారు. వచ్చే నెల 23 నుంచి యాత్రను నిర్వహించాలని భావిస్తుండగా, ఎక్కడి నుంచి ప్రారంభించి, ఎక్కడ ముగించాలనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. దీనిపై ఈ మీటింగ్​లో చర్చించనున్నారు.

మరిన్ని వార్తలు : -

కేంద్రాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహులా?

పెట్రోలు, డిజీల్ పై వ్యాట్ ను రాష్ట్రమూ తగ్గించాలె