గ్రూప్-1 ప్రిలిమినరీకి 101 సెంటర్లు

గ్రూప్-1 ప్రిలిమినరీకి 101 సెంటర్లు
  • మేడ్చల్​ అడిషనల్ కలెక్టర్ నర్సింహారెడ్డి

శామీర్​పేట, వెలుగు: ఈ నెల 11న జరగనున్న టీఎస్ పీఎస్​సీ గ్రూప్ –1 ప్రిలిమినరీ ఎగ్జామ్​కోసం మేడ్చల్ జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేయాలని మేడ్చల్​జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి అధికారులను ఆదేశించారు. ఎగ్జామ్​ఏర్పాట్లపై మంగళవారం శామీర్​పేటలోని మేడ్చల్ కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 101 సెంటర్లు ఏర్పాటు చేశామని, 49,690 మంది అభ్యర్థులు ఎగ్జామ్​రాయనున్నట్లు వెల్లడించారు. 

ఎగ్జామ్ సెంటర్లలో విద్యుత్, తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించడంతోపాటు సీసీ కెమెరాలు ఉండేలా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సైబరాబాద్ పోలీసులు పాల్గొన్నారు. అలాగే దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా సాగునీటి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని మేడ్చల్​కలెక్టర్ అమోయ్​కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. కీసర మండలం చీర్యాలలోని ఎంఎల్ఎన్ కన్వెన్షన్​లో జరగనున్న కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు.

రంగారెడ్డి జిల్లాలో 131..

రంగా రెడ్డి: గ్రూప్ 1 పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌‌ హరీశ్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. గ్రూప్​1 ఎగ్జామ్​కోసం జిల్లాలో131 సెంటర్లు ఏర్పాటు చేశామని, 55,032 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు తెలిపారు. అడిషనల్​కలెక్టర్ తిరుపతిరావు, రెవెన్యూ అధికారి హరిప్రియ, డీఈఓ సుశీందర్ రావు, అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దారులు  తదితరులు 
పాల్గొన్నారు.