జ్యోతిష్యం పేరుతో లక్షల రూపాయలు వసూల్ చేసి పరారైన ముఠా అరెస్ట్..

  జ్యోతిష్యం పేరుతో లక్షల రూపాయలు వసూల్ చేసి పరారైన ముఠా అరెస్ట్..

సాటిలైట్ యుగంలోనూ జనం ఇంకా గుప్త నిధుల వంటి వాటి గురించి ఆలోచించి.. బురిడీ బాబాల మాయ మాటల్లో పడి మోసపోతున్నారు. జనగామ జిల్లా కోడకండ్లలో గుప్తనిధుల పేరుతో ఓ కుటుంబంను భయబ్రాంతులకు గురి చేసి లక్షలు వసూల్ చేసిన ఘటన కలకలం రేపుతుంది. దీనిపై డీసీపీ రాజమహేంద్ర నాయక్ స్పందిస్తూ కోడకండ్లలో గుప్తనిధుల పేరుతో ఓ కుటుంబంను భయబ్రాంతులకు గురిచేసి రూ. 15లక్షల వసూలు చేసిన ముఠాను అరెస్టు చేశామని తెలిపారు. 

 జ్యోతిష్యం పేరుతో భయబ్రాంతులకు గురిచేసిన ఈ ముఠా కుటుంబంను ఎంతో డబ్బు లాగేశారని చెప్పారు. బాధితురాలి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని అన్నారు. వారి వద్ద నుండి రూ. 15లక్షల 540 వెండి రేకు బిళ్ళలు76బంగారు రేకు బిళ్ళలు. రెండు కార్లు స్వాధీనం చేసుకుని ఇద్దరుని అరెస్టు  చేశామని వెల్లడించారు..మరో ఇద్దరు పరారీలో ఉన్నారని త్వరలో వారిని కూడా పట్టుకుంటామని చెప్పారు డీసీపీ.