ఎయిర్‌‌‌‌పోర్టుల్లో భారీ భద్రత.. అదనపు చెకింగ్ పాయింట్లు

ఎయిర్‌‌‌‌పోర్టుల్లో భారీ భద్రత.. అదనపు చెకింగ్ పాయింట్లు

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎయిర్‌‌‌‌పోర్టుల్లో భద్రతను పెంచింది. అన్ని ఎయిర్‌‌‌‌పోర్టుల్లో సెక్యూరిటీని పెంచాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) ఆదేశాలిచ్చింది. ప్రతి ఎయిర్‌‌‌‌పోర్టులోనూ అన్ని విమానాలకూ అదనపు చెకింగ్‌‌ పాయింట్లు ఏర్పాటు చేయాలని తెలిపింది. సెకండరీ ల్యాడర్ పాయింట్ చెకింగ్ (ఎస్‌‌ఎల్‌‌పీసీ)ను తప్పనిసరి చేసింది. ఎయిర్‌‌‌‌పోర్టుల్లోని టెర్మినల్ బిల్డింగ్స్‌‌లోకి విజిటర్స్‌‌ ఎంట్రీపై నిషేధం విధించింది. 

విజిటర్ టికెట్ల అమ్మకాలను నిలిపివేయాలని ఆదేశించింది. ఫ్లైట్ సర్వీసులన్నీ యథావిధిగా నడుస్తున్నాయని ఢిల్లీ, ముంబై ఎయిర్‌‌‌‌పోర్టు అథారిటీలు తెలిపాయి. భద్రత చర్యల దృష్ట్యా చెకింగ్స్‌‌ను పెంచామని, ప్రయాణికులు 3 గంటల ముందే ఎయిర్‌‌‌‌పోర్టుకు చేరుకోవాలని సూచించాయి. ఎయిర్‌‌‌‌పోర్టుల్లో ప్రాసెస్‌‌ పూర్తవడానికి ఎక్కువ టైమ్‌‌ పడుతుందని, ప్యాసింజర్లు ముందుగానే వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పాయి. కాగా, పాక్‌‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో బార్డర్ రాష్ట్రాల్లోని 27 ఎయిర్‌‌‌‌పోర్టులను కేంద్రం తాత్కాలికంగా మూసివేసింది.