హైదరాబాద్ నాకు ఇష్టమైన ప్రదేశం

హైదరాబాద్ నాకు ఇష్టమైన ప్రదేశం

హైదరాబాద్ తనకు ఇష్టమైన ప్రదేశం అన్నాడు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్. బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని కూకట్ పల్లి  ఫోరమ్ మాల్ లో అంతిమ్ సినిమా ప్రమోషన్ కు హాజరై సందడి చేశాడు. ఈ సందర్భంగా మాట్లాడిన సల్మాన్..హైదరాబాద్ తనకు ఇష్టమైన ప్రదేశం అన్నాడు. నగరానికి రాగానే బిర్యాని తిన్నానన్న సల్మాన్.. అంతిమ్ సినిమాతో పాటు త్వరలో రిలీజ్ కాబోతున్న తడప్ సినిమా చూడాలని కోరాడు. హైదరాబాద్ కు మళ్లీ షూటింగ్ కు వచ్చినప్పుడు కచ్చితంగా అభిమానులను కలుస్తా అన్నాడు సల్మాన్.

సల్మాన్‌ను చూసేందుకు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. సల్మాన్‌ ఖాన్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై  నటిస్తూ నిర్మించిన మూవీ అంతిమ్‌.  ఆయుశ్‌ శర్మ ముఖ్య పాత్రధారి. మహేశ్‌ ముంజ్రేకర్‌ తెరకెక్కించిన ఈ సినిమా నవంబర్‌ 26న సినిమా విడుదలైంది.