GT vs LSG: తృటిలో తప్పిన పెను ప్రమాదం.. బౌలింగ్ వేస్తూ రెండు సార్లు కింద పడిన అర్షద్ ఖాన్

GT vs LSG: తృటిలో తప్పిన పెను ప్రమాదం.. బౌలింగ్ వేస్తూ రెండు సార్లు కింద పడిన అర్షద్ ఖాన్

ఐపీఎల్ లో గురువారం (మే 22) ఒక బాధాకర సంఘటన జరిగింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో లక్నో సూపర్ జయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ అర్షద్ ఖాన్ బౌలింగ్ వేస్తూ జారిపడ్డారు. గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. రెండో ఓవర్లో బౌలింగ్ చేయడానికి వచ్చిన అర్షద్ ఐదో బంతి వేసే క్రమంలో రెండు సార్లు స్లిప్ అయ్యాడు. రెండు సార్లు కూడా బాల్ రిలీజ్ చేస్తుండగా కాలు ట్విస్ట్ అయ్యి కింద పడ్డాడు. 

వెంటవెంటనే కింద పడడంతో అర్షద్ నొప్పితో గ్రౌండ్ లో విలవిల్లాడు. ఖచ్చితంగా అతని పాదానికి తీవ్ర గాయమైనట్టు అనిపించింది. ఎట్టకేలకు చివరి బంతిని పూర్తి చేసి గ్రౌండ్ లో నుంచి వెళ్ళిపోయాడు. అర్షద్ మరల గ్రౌండ్ లోకి వస్తాడా.. రాడా అనుకున్న సమయంలో 17 ఓవర్లో తిరిగి మైదానంలోకి అడుగు పెట్టడంతో గుజరాత్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. 19 ఓవర్ లో కూడా బౌలింగ్ చేసిన అర్షద్ ఓవరాల్ గా 3 ఓవర్లలో 36 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జయింట్స్ బ్యాటింగ్ లో విశ్వరూపం చూపించింది. ఓపెనర్ మిచెల్ మార్ష్(64 బంతుల్లో 117: 10 ఫోర్లు, 8 సిక్సర్లు) సెంచరీతో చెలరేగి ఆడగా.. పూరన్(56), మార్కరం (36) మెరుపులు మెరిపించారు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ చేసింది. మార్ష్ (117) సెంచరీ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. లక్నో బౌలర్లలో సాయి కిషోర్, అర్షద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.