Arshdeep Singh: గంభీర్, సంజుని ఆట పట్టించిన అర్ష్‌దీప్ సింగ్.. 

 Arshdeep Singh: గంభీర్, సంజుని ఆట పట్టించిన అర్ష్‌దీప్ సింగ్.. 

Arshdeep Singh: టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ ఘన విజయం సాధించిన తర్వాత ఆటగాళ్ల సంబరాలు మైదానంలోనే కాక సోషల్ మీడియాలో కూడా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ తో కలిసి చేసిన ఒక సరదా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా చాలా సీరియస్‌గా కనిపించే గంభీర్ ఈసారి అర్ష్‌దీప్‌తో కలిసి రీల్ చేస్తూ పెద్దగా నవ్వుతూ కనిపించడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. వీడియోలో అర్ష్‌దీప్ సరదాగా “పాజీ... కొన్నిసార్లు నవ్వండి యార్” అని చెప్పగా, గంభీర్ నవ్వుతూ స్పందించాడు. ఈ సన్నివేశం సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది.

అలాగే, సంజు శాంసన్ కలిసి తీసిన వీడియోలో పాజీ జస్టిస్ మిల్ గాయా అంటూ చేసిన కామెంట్స్ కి శాంసన్ కూడా నవ్వుతూ మిల్ గాయా అని వ్యాఖ్యానించాడు. అనంతరం ఇషాన్ తో కలిసి చేసిన వీడియోలో అర్ష్ దీప్ ఏక్ బిహారీ అనగానే.. ఇషాన్ కిషన్ సమాధానంగా సబ్ పర్ భారీ అంటూ ప్రపంచ కప్ విజేత వేడుకలు చేసుకున్నారు. కాగా ప్రస్తుతం ఈ మూడు వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే 2023 నుంచి భారత్ వైట్ బాల్ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. వన్డేలు, టీ20లు కలిపి ఇప్పటి వరకు 33 మ్యాచ్‌లలో 31 విజయాలు సాధించి.. కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయింది.

►ALSO READ | Mohammed Siraj: నీళ్లు తాగించాలి, బ్యాట్ అందివ్వడమే మా పని.. టీమ్ మేనేజ్మెంట్పై సిరాజ్ సెటైర్లు

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 255/5 స్కోరు నమోదు చేసింది. సంజు శాంసన్ (89), అభిషేక్ శర్మ (52), ఇషాన్ కిషన్ (54) వరుసగా హాఫ్ సెంచరీలు చేయగా.. చివర్లో శివమ్ దూబే (26 నాటౌట్) మెరుపు బ్యాటింగ్ చేయడంతో టీమిండియా భారీ స్కోర్ చేసింది.  అనంతరం బ్యాటింగ్ కి దిగిన న్యూజిలాండ్ తరఫున టిమ్ సైఫర్ట్ (52), మిచెల్ శాంట్నర్ (43) రాణించారు. భారత బౌలర్లలో  జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్ల తీసుకోగా, అక్షర్ పటేల్ 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు లక్ష్యాన్ని చేధించలేక ఓటమి పాలైంది.

భారత్ మూడు ప్రత్యేక రికార్డులు:  
* స్వదేశంలో టీ20 వరల్డ్ కప్ గెలిచిన మొదటి జట్టు
* వరుసగా రెండు టీ20 వరల్డ్ కప్ టైటిళ్లు గెలిచిన మొదటి జట్టు
* మొత్తం మూడు టీ20 వరల్డ్ కప్ ట్రోఫీలు గెలిచిన తొలి జట్టు
* ఈ విజయంతో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో అత్యుత్తమ విజయశాతం కలిగిన కెప్టెన్‌గా నిలిచాడు. అతని కెప్టెన్సీలో భారత్ 52 మ్యాచ్‌లలో 42 విజయాలు సాధించి 80.77 శాతం విన్నింగ్ రేటు నమోదు చేసింది.