బుల్లి బాహుబలి: 8 ఏళ్ల చిన్నారి.. 60 కిలోల బరువు ఎత్తింది

బుల్లి బాహుబలి: 8 ఏళ్ల చిన్నారి.. 60 కిలోల బరువు ఎత్తింది

హర్యానాలోని పంచకుల ప్రాంతానికి చెందిన అర్షియా గోస్వామి అనే ఎనిమిదేళ్ల బాలిక వెయిట్ లిఫ్టింగ్‌లో అంచనాలను మించి రాణిస్తోంది. గతంలో ఆరేళ్ల వయసులో 45 కిలోల బరువును ఎత్తడం ద్వారా, సంభావ్య ఒలింపిక్ పతక విజేత 2021లో అత్యంత పిన్న వయస్కురాలైన  డెడ్‌లిఫ్టర్‌గా రికార్డు సృష్టించింది. ఇదిలావుంటే, తాజాగా ఎనిమిదేళ్ల వయసులో 60 కిలోల బరువును ఎత్తి ఔరా అనిపిస్తోంది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 

ఆరు.. ఎనిమిదేళ్ల వయస్సు అంటే తోటి పిల్లతో కలిసి ఆడుకునే వయసు. అలాంటిది వెయిట్ లిఫ్టింగ్‌లో రాణించడమంటే ఆషా మాషీ కాదు. ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను నుండి తాను ప్రేరణ పొందినట్లు అర్షియా వీడియోలో పేర్కొంది. మొదట ఆరు సంవత్సరాల వయస్సులో 45 కిలోల బరువును ఎత్తి రాష్ట్ర స్థాయిలో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ టోర్నీలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఆనాటి నుంచి బుల్లి బాహుబలిగా పేరొంది, అలవోకగా బరువులు ఎత్తేస్తుంది. పవర్‌లిఫ్టింగ్ మరియు టైక్వాండో గోస్వామికి ఇష్టమైన మరో రెండు క్రీడలు. 

'నేను వెయిట్‌లిఫ్టింగ్‌ను చాలా ఇష్టపడతాను. దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలిగా ఈ రికార్డులు సృస్టిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. రేపు నేను పెద్దయ్యాక, మన దేశానికి బంగారు పతకం సాధించాలనుకుంటున్నాను. అదే నా కల..' అని ఆర్షియా చెప్తోంది.

https://www.instagram.com/reel/CrmxRD2O7sF/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/reel/Csp8pnKMXFr/?utm_source=ig_web_copy_link