ART Cinemas: పూజా కార్యక్రమాలతో మొదలైన ఏషియన్ రవితేజ సినిమాస్.. ఎక్కడో తెలుసా?

ART Cinemas: పూజా కార్యక్రమాలతో మొదలైన ఏషియన్ రవితేజ సినిమాస్.. ఎక్కడో తెలుసా?

ప్రముఖ థియేటర్స్ సంస్థ ఏషియన్(Asian Cinemas) ఇప్పటికే పలువురు టాలీవుడ్ హీరోలతో కలిసి కొన్ని మల్టీప్లెక్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సంస్థ.. మహేష్ బాబు(Mahesh Babu)తో ఏఎంబి సినిమాస్(AMB Cinemas), అల్లు అర్జున్ తో త్రిబుల్ ఏ సినిమాస్(AAA Cinemas), విజయ్ దేవరకొండ తో ఏవిడి సినిమాస్(AVD Cinemas) మల్టీప్లెక్స్ లను ప్రారంభించింది. తాజాగా మరో హీరోతో కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టింది ఆసియన్ సంస్థ. ఆ హీరో మరెవరో కాదు.. మాస్ మహారాజా రవితేజ(Raviteja).

అవును.. రవితేజ తో ఏషియన్ సంస్థ కొత్త వెంచర్ మొదలుపెట్టింది. దానికి ఏఆర్టి గా నామకరణం చేసింది. ఏఆర్టి అంటే ఏషియన్ రవితేజ అని. హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో నిర్మాణం అవుతున్న ఏఆర్టి సినిమాస్.. అధికారికంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆసియన్ సునీల్ కుటుంబంతో పాటు.. హీరో రవితేజ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. ప్రస్తుతం రవితేజ మిస్టర్ బచ్చన్ షూటింగ్ లో ఉన్న కారణంగా ఈ పూజ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు.

Also Read :తరుణ్ భాస్కర్ హీరోగా జయజయ జయహే.. మలయాళ సూపర్ హిట్ రీమేక్