వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్లో అరుంధతి, మీనాక్షి

 వరల్డ్ బాక్సింగ్  కప్ ఫైనల్లో అరుంధతి, మీనాక్షి

గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నోయిడా: సొంతగడ్డపై వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌‌‌‌‌‌‌‌లో ఇండియా బాక్సర్లు అదరగొడుతున్నారు. అరుంధతి చౌదరి (70 కేజీ),  మీనాక్షి (48 కేజీ), పర్వీన్ (60 కేజీ),  ప్రీతి (54 కేజీ), నుపూర్ (80+ కేజీ), అంకుష్ ఫంగల్ (80 కేజీ)  ఫైనల్ చేరుకున్నారు. ఏడాదిన్నర గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన అరుంధతి.. మంగళవారం (నవంబర్ 18) జరిగిన సెమీఫైనల్లో ట్రిపుల్ వరల్డ్ కప్ మెడలిస్ట్, జర్మనీ బాక్సర్ లియోనీ ముల్లర్‌‌‌‌‌‌‌‌ను అరుంధతి చిత్తు చేసింది. 

పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ పంచ్‌‌‌‌‌‌‌‌లు కొట్టిన ఇండియా బాక్సర్ మూడో రౌండ్‌‌‌‌‌‌‌‌లో లియోనీని నాకౌట్ చేసింది. వరల్డ్ చాంప్ మీనాక్షి 5–0 తో  కొరియాకు చెందిన బక్ చో-రోంగ్‌‌‌‌‌‌‌‌ను, నుపూర్ 5–0తో మరియా లోవ్‌‌‌‌‌‌‌‌చిన్‌‌‌‌‌‌‌‌స్కా (ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌)ను చిత్తు చేయగా.. ప్రీతి 4–0తో మూడుసార్లు వరల్డ్ చాంపియన్ సియవో వెన్ (చైనీస్‌‌‌‌‌‌‌‌ తైపీ)కు చెక్ పెట్టింది.  పర్వీన్ 3–2తో  అనేటా (పోలాండ్‌‌‌‌‌‌‌‌)పై కష్టపడి గెలిచారు. సవీటి బూరా (75 కేజీ)  సెమీస్‌‌‌‌‌‌‌‌లో వెనుదిరగ్గా..  మెన్స్ సెమీస్‌‌‌‌‌‌‌‌లో అంకుష్ ఫంగల్ 5–0తో మార్లోన్ సెవెహోన్‌‌‌‌‌‌‌‌ (ఆస్ట్రేలియా)ను ఓడించాడు.