అరవింద్ ఎక్స్పైరీ అయిపోయిన మందు : జీవన్ రెడ్డి

అరవింద్ ఎక్స్పైరీ అయిపోయిన మందు : జీవన్ రెడ్డి

బీజేపీ పార్టీ పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. బీజేపీ  మతంతో రాజకీయం చేస్తుందని ఆరోపించారు. అరవింద్ ది కాంగ్రెస్ డీఎన్ఏ అని 2018లో బీజేపీలో చేరారని చెప్పారు. వరంగల్ తర్వాత జగిత్యాల జిల్లాలోనే అధికంగా విద్యసౌకర్యాలు ఉన్నాయని నిజామాబాద్ లో ఇంతవరకు మహిళా డిగ్రీ కళాశాల లేదని తెలిపారు. జగిత్యాలలో నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జీవన్ రెడ్డి పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన జీవితం చివరి వరకు, మంచంలో పడుకునైనా ప్రజా సేవ చేస్తానని చెప్పారు. జాతీయ వాదానికి మారుపేరు కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. రాష్ట్రంలో లాగే జాతీయ స్థాయిలో కూడా మార్పు రాబోతుందని ఇండియా కూటమి గెలవబోతుందని జోస్యం చెప్పారు. ఎంపీ అరవింద్ ఎక్స్పైరీ అయిపోయిన మందని నయా మందుగా తనను గెలిపించడంని జీవన్ రెడ్డి కోరారు.