షాకింగ్ : కవిత అరెస్ట్ కేసులో.. సీఎం కేజ్రీవాల్ కు ముందస్తు బెయిల్

షాకింగ్ : కవిత అరెస్ట్ కేసులో.. సీఎం కేజ్రీవాల్ కు ముందస్తు బెయిల్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులోనే.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ముందస్తు బెయిల్ దొరికింది.  సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు.  రూ. 15 వేల పూచీకత్తు.. లక్ష రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ పై   బెయిల్ మంజూరు చేసింది.  

విచారణకు హాజరుకావాలని   8 సార్లు కేజ్రీవాల్ కు ఈడీ నోటసులు జారీ చేసింది.  కేజ్రీవాల్ విచారణకు హాజరుకాకపోవడంతో   ఈడీ మెజిస్టిరియల్ కోర్టుకు వెళ్లింది. దీంతో మార్చి 16న తమ ఎదుట హాజరు కావాలని  న్యాయమూర్తి కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేశారు. దీనిపై స్టే ఇవ్వాలన్న సీఎం పిటిషన్ ను  సెషన్స్ కోర్టు తిరస్కరించడంతో ఇవాళ అవెన్యూ కోర్టు ఎదుట హాజరయ్యారు కేజ్రీవాల్. అనంతరం  15 వేల బాండ్, రూ.లక్ష పూచికత్తుతో కేజ్రీవాల్ కు  బెయిల్ ఇచ్చింది.

కోర్టు ముందుకు కవిత

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవితకు ఈడీ కార్యాలయంలో వైద్య పరీక్షలు ముగిశాయి. దీంతో మరికాసేపట్లో ఆమెను ఈడీ అధికారులు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చనున్నారు. ఈ సందర్భంగా  కవితను కస్టడీకి ఇవ్వాలని కోరనున్నారు ఈడీ అధికారులు.  కవిత కూడా తన అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. 

 మార్చి 15 తేదీ శుక్రవాం మధ్యాహ్నం హైదరాబాద్ లోని కవిత నివాసంలో మొదట ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం రంగంలోకి దిగిన ఈడీ అధికారులు.. కవిత నివాసానికి చేరకుని కొంతసేపు సోదాలు చేసి ఆమెను విచారించింది. అనంతరం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఆమెను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు ఈడీ అధికారులు. భారీ భద్రత నడుమ కవితను ఢీల్లీలోని ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు అధికారులు.