ప్రజల్ని కాపాడేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం

ప్రజల్ని కాపాడేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం

న్యూఢిల్లీ: దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రధాని మోడీని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ఈ మేరకు నాలుగు సూచనలతో కూడిన ఓ లేఖను పీఎంకు కేజ్రీ పంపారు. మూడో వేవ్ ప్రమాదం నుంచి దేశాన్ని కాపాడాంటే టీకా ప్రక్రియను పూర్తి చేయడం చాలా కీలకమని పేర్కొన్నారు. 

కేజ్రీవాల్ చెప్పిన నాలుగు సూచనలు: 

  • కొవ్యాక్సిన్ ను రూపొందించిన భారత్ బయోటెక్ సంస్థ తమ ఫార్ములాను పంచుకోవడానికి సిధ్ధంగా ఉంది. కాబట్టి దేశంలో టీకాలు తయారు చేసే అన్ని కంపెనీలను కేంద్రం పిలవాలి. యుధ్ధ ప్రాతిపదికన వెంటనే వ్యాక్సిన్ తయారు చేయాలని ఆయా సంస్థలను ఆదేశించాలి.  
  • కరోనా టీకాలను తయారు చేస్తున్న విదేశీ కంపెనీతో 24 గంటల్లో వ్యాక్సిన్ తయారీని ప్రారంభించమని ఒప్పించాలి. విదేశాలతో మాట్లాడే బాధ్యతను కేంద్రమే తీసుకోవాలి.
  • కొన్ని దేశాలు అవసరానికి మించి టీకాలను తమ దగ్గర పోగు చేసుకుంటున్నాయని తెలిసింది. అలాంటి దేశాలను ఒప్పించి మిగులు టీకాలను భారత్ కు రప్పించే ప్రయత్నం చేయాలి. 
  • వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న విదేశీ కంపెనీలకు మన దేశంలో టీకా తయారీకి వెంటనే అనుమతులు ఇవ్వాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.