మరోసారి విశ్వాస పరీక్షకు సిద్దమైన కేజ్రీవాల్.. కారణం ఇదే

మరోసారి  విశ్వాస పరీక్షకు సిద్దమైన కేజ్రీవాల్.. కారణం ఇదే

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 17న అసెంబ్లీలో విశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. కేజ్రీవాల్ ఆరు నెలల క్రితం ఒకసారి విశ్వాస పరీక్ష ఎదుర్కొన్నారు.

 తమ పార్టీ నేతలను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తుందని కేజ్రీవాల్ ఇటీవల ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలతో బీజేపీ టచ్ లో ఉందని.. వారికి ఒక్కొక్కరికి రూ.25 కోట్ల  ఆఫర్ ఇచ్చారని ఆరోపించారు. బీజేపీతో కలిస్తే తనపై కేసులు లేకుండా చేస్తామన్నారని..ఇటీవల కేజ్రీవాల్ వ్యాఖ్యలు సంచలనం రేపాయి. 

ALSO READ : ప్రజలు కంప్లయింట్ చేస్తే పట్టించకోరేం:..పోలీసుల తీరు మారాలి: హైకోర్టు

 ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ కు ఇప్పటికే పలుసార్లు నోటీసులు పింపిన సంగతి తెలిసిందే. ఇటీవల జార్ఖండ్ సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్ ను ఈడీ ఇలాగే నోటీసులిచ్చి అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ ను కూడా విచారణ పేరుతో అరెస్ట్ చేస్తారని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.