నేను జూన్ 2న లొంగిపోతా: కేజ్రీవాల్

నేను  జూన్ 2న లొంగిపోతా: కేజ్రీవాల్

లిక్కర్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్  గడువు రేపటితో ముగుస్తుండటంతో  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జూన్ 2న లొంగిపోతున్నట్లు చెప్పారు.  ఇవాళ వీడియో రిలీజ్ చేసిన కేజ్రీవాల్.. లిక్కర్ కేసులో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎల్లుండి సరెండర్ అవుతానన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. కానీ ఈ సారి ఎంతకాలం తనను జైలులో ఉంచుతారో తెలియదన్నారు. తానను తాను రక్షించుకునేందుకు మళ్లీ తీహార్ జైలుకు వెళ్తున్నానన్నారు. చట్టాలకు లోబడి  జైలుకు వెళ్తున్నందుకు గర్వంగా ఉందన్నారు కేజ్రీవాల్. కానీ  జైలులో  ఈ సారి ఎక్కువగా హింసించవచ్చన్నారు. కాని తలవంచేది లేదన్నారు. తాను జైలులో ఉన్నా ప్రభుత్వ పథకాలు కొనసాగుతాయన్నారు. ప్రజలు ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. 

బీజేపీ  నా నోరు మూయించేందుకు ప్రయత్నించింది కానీ ఆశలు  ఫలించలేదు. ఎప్పటికీ  నేను తలవంచను... నేను ఎక్కడ ఉన్నా జైల్లో ఉన్నా  బయట ఉన్నా  ఉచిత విద్యుత్, మొహల్లా క్లినిక్‌లు, ఆసుపత్రులు, ఉచిత మందులు, చికిత్స, 24 -గంట కరెంటు పథకాలు కొనసాగుతాయి.  జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత   ప్రతి మహిళలకు   ప్రతి నెలా రూ 1000 ఇస్తాను.  నా తల్లిదండ్రులు చాలా పెద్దవారు. మా అమ్మ చాలా అనారోగ్యంతో ఉంది. జైలులో ఉన్న ఆమె గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నాను.  నా తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి అంటూ కేజ్రీవాల్  విజ్ఞప్తి చేశారు. 

లిక్కర్ స్కాం కేసులో  తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మే 10న మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు. మళ్లీ జూన్ 2న సరెండర్ కావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే..