లిక్కర్ కేసు: కేజ్రీవాల్ పిటిషన్ను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు

లిక్కర్ కేసు: కేజ్రీవాల్ పిటిషన్ను  కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీ హైకోర్టులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు చుక్కెదురయ్యింది. కేజ్రీవాల్ పటిటిషన్ ను కొట్టేసింది. లిక్కర్ కేసులో అరెస్ట్, ట్రయల్ కోర్టు కస్టడీని  సవాల్ చేస్తూ కేజ్రీవాల్ హైకోర్టులో  పిటిషన్ వేశారు.  ఏప్రిల్ 9న విచారణ జరిపిన హైకోర్టు కేజ్రీవాల్ అరెస్ట్ ను సమర్థించింది.  కేజ్రీవాల్ అరెస్ట్ కు తగిన ఆధారాలున్నాయని తెలిపింది.

  సీఎం అయినంత మాత్రానా విచారణ ఎలా జరగాలో  చెప్పక్కర్లేదు.. చట్టం ముందు అందరూ సమానమేనని చెప్పింది.  కేజ్రీవాల్ కుట్ర పన్నినట్లుగా ఆధారాలున్నాయని తెలిపింది.  గోవా ఎన్నికల కోసం డబ్బును నగదు రూపంలో పంపించారు. అరెస్టు చట్టవిరుద్ధం కాదు, రిమాండ్‌ను చట్టవిరుద్ధంగా పేర్కొనలేమని తెలిపింది. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. 

మరో వైపు  ఢిల్లీ హైకోర్టు తీర్పుపై ఆమ్ ఆద్మీ పార్టీ  అభ్యంతరం తెలుపుతోంది. హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు. కేజ్రీవాల్ ఏప్రిల్ 10న  సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని ఆప్ వర్గాలు తెలిపాయి.