నా తల్లిదండ్రులను టార్గెట్ చేస్తరా? : కేజ్రీవాల్ ఫైర్

నా తల్లిదండ్రులను టార్గెట్ చేస్తరా? : కేజ్రీవాల్ ఫైర్

న్యూఢిల్లీ: వృద్ధాప్యంతోపాటు అనారోగ్యంతో ఉన్న తన పేరెంట్స్ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ ప్రధాని మోదీపై ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. ఆప్ ఎంపీ స్వాతి మలివాల్​పై దాడి కేసులో కేజ్రీవాల్ తల్లిదండ్రులను ఢిల్లీ పోలీసులు ప్రశ్నించనున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో కేజ్రీవాల్ గురువారం ప్రెస్​ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ.. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న తన తల్లిందండ్రులను ప్రధాని మోదీ టార్గెట్ చేశారని మండిపడ్డారు. తనను అరెస్ట్ చేసిన రోజే తన తల్లి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని, తండ్రి 85 ఏండ్ల పెద్దాయన అని చెప్పారు. ‘‘మా ఎమ్మెల్యేలను, మంత్రిని, ఆఖరికి నన్ను కూడా జైల్లో పెట్టి వేధించారు. అయినా నేను లొంగలేదు. ఇప్పుడు ప్రధాని మోదీ అన్ని హద్దులు మీరి నా తల్లిదండ్రులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?” అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.