మిస్టర్‌‌‌‌ ఎక్స్‌‌ షురూ

మిస్టర్‌‌‌‌ ఎక్స్‌‌ షురూ

ఆర్య, గౌతమ్ కార్తీక్ హీరోలుగా తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘మిస్టర్‌‌‌‌ ఎక్స్‌‌’.  శరత్ కుమార్,  మంజు వారియర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనఘ హీరోయిన్‌‌. ‘ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌’ ఫేమ్ మను ఆనంద్ దర్శకత్వంలో ఎస్‌‌.లక్ష్మణ్‌‌ కుమార్‌‌ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది.  

ఈ షెడ్యూల్‌‌లో ఆర్య, గౌతమ్‌‌తో పాటు ముఖ్య నటీనటులపై కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. మంగళవారం లొకేషన్‌‌లోని  స్టిల్స్‌‌ని విడుదల చేశారు మేకర్స్. ఇందులోని యాక్షన్ సీన్స్‌‌ని ఇండియా, ఉగాండా, అజర్‌‌బైజాన్, జార్జియా దేశాల్లో షూట్ చేయనున్నట్టు తెలియజేశారు. స్టంట్ సిల్వా యాక్షన్ కొరియోగ్రాఫర్. ధిబు నినాన్ థామస్ సంగీతం అందిస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.