
ప్రతి శుక్రవారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) కార్యాలయానికి వెళ్లే హాజరు నుండి మినహాయింపు కోరుతూ ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ముంబై హైకోర్టును ఆశ్రయించాడు. క్రూజ్ నౌక డ్రగ్ కేసులో అరెస్టైన ఆర్యన్... అక్టోబర్ 28న కొన్ని కండిషన్స్ తో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ఇందులో భాగంగా ప్రతి శుక్రవారం NCBకి వెళ్లి సంతకం చేయాల్సి ఉంటుంది. దీన్ని మినహాయింపు కోరాడు. NCB కార్యాలయానికి వస్తున్న ప్రతిసారి తనను మీడియా టార్గెట్ చేస్తోందని.. ఆఫీసు లోపలికి, బయటకు వెళ్లేందుకు పోలీసులు పహారాగా రావాల్సి వస్తోందని పిటిషన్‌లో తెలిపాడు. ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరై, విడుదలైన తర్వాత అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో NCB ఆఫీసుకు హాజరుకాలేకపోయాడు.