ఈ నెల 8న ‘కెప్టెన్’ వస్తున్నాడు

ఈ నెల 8న ‘కెప్టెన్’ వస్తున్నాడు

తమిళ హీరో ఆర్యకు తెలుగులోనూ మంచి ఇమేజ్ ఉంది. డబ్బింగ్ సినిమాలతో పాటు, పలు తెలుగు మూవీస్‌‌‌‌లోనూ నటించి గుర్తింపు అందుకున్నాడు. తాజాగా ‘కెప్టెన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఆర్య. సెప్టెంబర్ 8న ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో అతను ఆర్మీ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా కనిపించనున్నాడు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌‌‌‌. సిమ్రాన్ కీలక పాత్ర పోషించింది. శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని  థింక్ స్టూడియోస్ సంస్థ నిర్మించింది. 

తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై నితిన్ తండ్రి సుధాకర్  రెడ్డి రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్‌‌‌‌ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మేకర్స్. నిన్న మెలోడీ సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు. ‘నందలాల.. నా కలకు అందం నువ్వేనురా. నందలాల.. ఆశలకు అర్థం నువ్వేనురా’ అంటూ సాగే సాంగ్‌‌‌‌లో ఆర్య, ఐశ్వర్య లుక్స్ ఇంప్రెస్ చేస్తున్నాయి.  డి.ఇమ్మాన్ ట్యూన్ చేసిన ఈ పాటకు  రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. యాజిన్ నిజర్, శ్రీనిష జయసీలన్ కలిసి పాట పాడిన విధానం ఆకట్టుకుంటుంది.