ఆకలి తీర్చే పనికి అంబాసిడర్లుగా

ఆకలి తీర్చే పనికి అంబాసిడర్లుగా

ప్రియాంక చోప్రా బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌‌‌‌లోకి ఎంటరై… ఇప్పుడు ‘గ్లోబల్ స్టార్’అని పిలిపించుకుంటోన్న ఏకైక ఇండియన్ ఫిమేల్ స్టార్. హాలీవుడ్ కి వెళ్ళిన తర్వాత అమెరికన్ సింగర్ నిక్ జొనాస్‌‌‌‌ను పెళ్లిచేసుకుంది. ఆమెకంటే పదేళ్లు చిన్నవాడైన జొనాస్ ని పెళ్లిచేసుకోవటాన్ని కొందరు విమర్శించినా పెద్దగా పట్టించుకోలేదు. తన పని తాను చేసుకుంటూ హాలీవుడ్‌‌‌‌లోనే స్థిరపడింది. దాదాపుగా ఇక బాలీవుడ్‌‌‌‌కి ‘గుడ్ బై’ చెప్పేసినట్టే.  అందుకే హిందీ సినిమాలకు కూడా ఎక్కువగా సైన్‌‌‌‌ చెయ్యటం లేదు. ఇక బాలీవుడ్ ఫిల్మీమీడియా కూడా ప్రియాంకని పక్కన పెట్టేసింది. అడపాదడపా తప్ప ఆమె గురించి లోకల్ పత్రికల్లో పెద్దగా న్యూస్ లేదు.

అయితే ఉన్నట్టుండీ భర్తతో కలిసి కొన్ని ఫొటోలని పోస్ట్ చేసి మళ్లీ వైరల్ వార్తల్లోకి వచ్చేసింది. ఆ ఫొటోలు పోస్ట్ చేయడం వెనుక ఒక మంచి కారణం కూడా ఉంది. అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ మనవరాలు ‘లోరెన్‌‌‌‌ బుష్’  ఫీడ్(FEED) అనే కంపెనీ నడుపుతోంది. ఆ కంపెనీకి ఈ సంవత్సరం  బ్రాండ్ అంబాసిడర్ అయ్యింది ఈ జోడీ. ‘ఫీడ్ హాలిడే’ పేరుతో సెలవుల్లో కూడా పేద పిల్లలకి ఫుడ్ అందించే క్యాంపెయిన్‌‌‌‌లో భాగంగా ప్రియాంక, జొనాస్‌‌‌‌లు ఫీడ్ ప్రొడక్ట్స్‌‌‌‌ని ప్రమోట్ చేస్తారన్నమాట.

బడ్జెట్ ని బట్టి బ్యాగ్

ఫీడ్‌‌‌‌లో తయారయ్యే ప్రతీ బ్యాగ్ మీదా ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్‌‌‌‌‌‌‌‌ని బట్టి ఆ బ్యాగ్ ధర ఉంటుంది. ఇంతకీ ఆ నెంబర్ ఏమిటంటే.. ఆ బ్యాగ్ వల్ల ఎంతమంది పిల్లలకు భోజనం పెడతారో ఆ నెంబర్ బ్యాగ్ మీద వేస్తారన్నమాట. అంటే మన బడ్జెట్‌‌‌‌ని బట్టి ఎంతమంది పిల్లలకి ఫుడ్ ఇవ్వగలమో చూసుకొని ఆ బ్యాగ్ కొనుక్కోవచ్చు. మామూలుగా  ఒక ఫీడ్ బ్యాగ్ కొంటే ఒక సంవత్సరం పాటు ఒక పసిపిల్లవాడికి భోజనం అందుతుంది. అలాగని వస్తువుల క్వాలిటీలో ఏమాత్రం తేడా ఉండదు. పక్కా క్వాలిటీ లెదర్‌‌‌‌‌‌‌‌తో తయారవుతాయి.

అందరికీ సరిపోయేంత ఫుడ్ ఉంది

ఫీడ్‌‌‌‌తో లోరెన్‌‌‌‌  చేసిన వర్క్ ఆమెని ఫార్చ్యూన్ నిర్వహించే కాంటెస్ట్‌‌‌‌లో ‘మోస్ట్ పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ విమెన్ ఎంట్ర ప్రెన్యూర్ 2009’గా నిలబెట్టింది. ‘‘ప్రపంచంలో అందరికీ సరిపోయేంత ఫుడ్ ఉంది, కానీ అది కొన్ని ప్రాంతాల్లోనే ఉంది. దాన్ని అందరికీ అందేలా చెయ్యటమే నా టార్గెట్’’ అంటోంది లోరెన్‌‌‌‌ బుష్. స్వతహాగా తాను ఒక మోడల్, ఫ్యాషన్ డిజైనర్ కూడా కావటంవల్ల తన కెరీర్ నీ, ఆశయాన్నీ కలిపి తానే ఒక గోల్ సెట్ చేసుకుంది. ఫీడ్ ప్రొడక్ట్‌‌‌‌లని మార్కెట్ చేస్తూనే దానితో వచ్చే లాభాలతో పేదపిల్లలకి ఫుడ్ అందిస్తోంది.