వైరల్ వీడియో: అడ్డుకున్న పోలీసుల ఆకలి తీర్చిన రైతన్నలు

వైరల్ వీడియో: అడ్డుకున్న పోలీసుల ఆకలి తీర్చిన రైతన్నలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రైతులు నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. కొత్త వ్యవసాయ బిల్లులపై కేంద్ర తీరును వ్యతిరేకిస్తూ రైతులు ఛలో ఢిల్లీ ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో రైతులను ఢిల్లీకి రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇందులో భాగంగా సింఘూ బార్డర్‌‌ వద్దకు చేరుకున్న రైతులపై పోలీసులు టియర్ గ్యాస్‌‌ను ప్రయోగించారు. అలాగే టిగ్రూ సరిహద్దు వద్ద ఓ సెక్యూరిటీ అధికారి వాటర్ కెనాన్లను వినియోగించాడు. ఈ నేపథ్యంలో పోలీసులకు, రైతులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కానీ రైతులు తమ పెద్ద మనసును చాటుకున్నారు. దప్పికతో ఉన్న ఓ పోలీసుకు రైతు నీళ్లు తాగించడం, కొందరు పోలీసులకు గురుద్వారాలో అన్నదానం చేయడం అందర్నీ ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్‌‌లో వైరల్ అవుతున్నాయి. అన్నం పెట్టే రైతన్నను అడ్డుకున్నా, అన్నదాతలపై లాఠీలు ఝళిపించినా అందరి దాహం, ఆకలి తీరుస్తారంటూ ఈ వీడియోలపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.