ఆగస్టు 11న లాల్‌‌సింగ్ చడ్డా సినిమా విడుదల

ఆగస్టు 11న లాల్‌‌సింగ్ చడ్డా సినిమా విడుదల

ఆమిర్ ఖాన్ హీరోగా అద్వైత్ చందన్ రూపొందించిన చిత్రం ‘లాల్‌‌సింగ్ చడ్డా’.  కరీనాకపూర్‌‌ హీరోయిన్‌‌. నాగచైతన్య కీలక పాత్రను పోషించాడు. ఆగస్టు 11న సినిమా విడుదలవుతున్న సందర్భంగా నిన్న తెలుగు ట్రైలర్‌‌‌‌ను చిరంజీవి లాంచ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘చిరకాల మిత్రుడు ఆమిర్ ఖాన్ ఈ సినిమాకు నన్ను ప్రెజెంటర్‌‌గా‌‌ ఉండాలని కోరినప్పుడు ప్రివిలేజ్‌‌గా భావించి కచ్చితంగా చేస్తానన్నా. ‘ఫారెస్ట్ గంప్’  రీమేక్‌‌కి ఆమిర్ పర్ఫెక్ట్‌‌. అతని సినిమాలు, వ్యక్తిత్వం, నడవడిక నాకిష్టం. సినిమాలపై ఆయన పెట్టే ప్యాషన్ ఆయన్ని స్పెషల్ ఇమేజ్‌‌లో ఉంచుతుంది. ఎంత పెద్ద నటుడైనా, ఎంత గొప్పవారైనా ఆయన నటనకు ఫిదా అవ్వాల్సిందే.. తనను లవ్ చేయాల్సిందే. ‘లాల్‌‌సింగ్ చడ్డా’తో ఇలాంటి లెజెండరీ యాక్టర్‌‌‌‌ని తెలుగు ఆడియెన్స్‌‌ గుండెల్లో పెట్టుకుంటారని కోరుకుంటున్నా’ అన్నారు. ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ ‘మా సినిమాకు చిరంజీవి గారు ప్రెజెంటర్‌‌‌‌గా ఉండటం గౌరవంగా భావిస్తున్నా. పద్నాలుగేళ్ల క్రితమే అతుల్ కులకర్ణి ఈ స్క్రిప్ట్ రాశారు. కానీ ‘ఫారెస్ట్‌‌ గంప్‌‌’ రీమేక్ రైట్స్ తీసుకోడానికి పదేళ్లు టైమ్ పట్టింది. ఒరిజినల్‌‌తో పోల్చితే చాలా మార్పులు చేశాం. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌‌ కోసం అడల్ట్‌‌ సీన్స్ తీసేశాం. అందం, అమాయకత్వం, ప్యూరిటీ కలిగిన హీరో పాత్ర చాలా ఇన్‌‌స్పైరింగ్‌‌గా ఉంటుంది.

నిజానికి హీరో అనగానే ఫిజికల్‌‌గానో, మోరల్‌‌గానో పవర్‌‌‌‌ఫుల్‌‌గా ఉంటారు. కానీ ఇన్నోసెన్స్‌‌లోనూ ఓ పవర్‌‌‌‌ ఉంటుంది. అందుకే ఇది పిల్లలు, ఫ్యామిలీస్‌‌ తప్పకచూడాల్సిన చిత్రం. ఇందులో చైతు చాలా బాగా నటించాడు. కార్గిల్‌‌లో నెలరోజుల పాటు షూట్ చేశాం. ప్రతిరోజూ నేను, చైతు ఒకే కారులో లొకేషన్‌‌కు వెళ్లేవాళ్లం. తన టాలెంట్,   ప్రొఫెషనలిజం, హార్డ్ వర్క్ చాలా నచ్చాయి’అన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ ‘యాక్టింగ్‌‌లో  ఆమిర్ గారి సినిమాలే నాకు రిఫరెన్స్.  ఆయనతో నటించడమంటే అది స్పెషల్ మూమెంట్. ఆయన నుంచి  చాలా నేర్చుకున్నా.  గుంటూరు జిల్లా బోడిపాలెం నుంచి వచ్చే బాలరాజు పాత్రలో నటించా.  మన కల్చర్‌‌‌‌ను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసిన పాత్ర అది.  ఇరవై, ముప్ఫై నిమిషాలే కనిపించినా   యాక్టర్‌‌‌‌గా నాకొక మంచి గుర్తింపు తెస్తుంది. చిరంజీవిగారు, ఆమిర్ ఖాన్‌‌ గారితో స్టేజ్ షేర్ చేసుకున్న ఈరోజును ఎప్పటికీ మర్చిపోలేను’ అని చెప్పాడు.